Bigg Boss 7: శుభశ్రీ మీద మీదకు వెళ్ళిన శివాజీ.. ఓవరాక్షన్ చేశాడట
బిగ్ బాస్ సీజన్ 7 లో నాలుగో పవర్ అస్త్ర కోసం గట్టి పోటి సాగుతుంది. టాస్క్‌ల సంగతి ఏమో కానీ.. హౌస్‌లో ఉన్నవారి మధ్య గొడవలు మాత్రం ఓ రేంజ్‌లో నడుస్తున్నాయ్. (Bigg Boss 7) నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ హౌస్ మేట్స్ గాయపడే వరకు వచ్చింది. నాలుగో పవర్ అస్త్ర సాధిస్తే రెండు వారాల ఇమ్యూనిటీ లభిస్తుందని చెప్పాడు బిగ్ బాస్. ఇందులో భాగంగానే హౌజ్ మెట్స్ అయిన శివాజీ, సందీప్, శోభా ముగ్గురు బ్యాంకర్స్ గా వ్యవహరించాలని చెప్పాడు. ఆ ముగ్గురు తమ కాయిన్స్ ను నచ్చినవాళ్లకు ఇవ్వొచ్చని చెప్పాడు. కంటెస్టంట్లు గేమ్స్ ను ఆడి కాయిన్స్ గెలుచుకోవాలి..అలాగే కాయిన్స్ ను లాకర్లలో దాచుకోవాలి అని సూచించాడు. ఆట పూర్తయ్యేసరికి ఏ కంటెస్టెంట్ దగ్గరైతే ఎక్కువ కాయిన్స్ ఉంటాయో వాళ్ల నాలుగో పవరస్త్ర పోటీలో ఉంటారని క్లారిటీ ఇచ్చాడు. దీంతో నానా తిప్పలు పడి కంటెస్టెంట్స్ అందరూ.. తేజ – 51, గౌతమ్ – 24, ప్రియాంక – 41, అమరదీప్ – 41, రతిక – 35, యవర్ – 43, ప్రశాంత్ – 33, శుభశ్రీ – 31 కాయిన్స్ సాధించారు. కాయిన్స్ సంపాదించారు.
అయితే కంటెస్టెంట్స్ గెలుచుకున్న కాయిన్స్ అన్నింటినీ సేఫ్ డిపాజిట్‌లో పెట్టారు. వాటికి కాపలాగా బ్యాంకర్స్ ఉన్నారు. అయితే సేఫ్ లాకర్స్ పై కన్నేసిన శుభ శ్రీ... కాయిన్స్ కొట్టేద్దామని అక్కడికి వచ్చింది. ఈ క్రమంలోనే శుభ శ్రీని ఓ మూలకు కార్నర్ చేసి అడ్డుగా దగ్గరగా నిలబడ్డాడు శివాజీ. దానికి అంత దగ్గరగా రావద్దు ప్లీజ్ అని శుభ శ్రీ అంటూ స్టార్ట్ చేసింది. ఇది నా ప్రాపర్టీ అని శివాజీ అన్నాడు. లేదు ఇది కాదు మీ ప్రాపర్టీ. అది అంటూ సేఫ్ లాకర్స్ చూపించింది శుభ శ్రీ. ప్లీజ్ వెనక్కి వెళ్లండి అంటూ దండం పెట్టింది. నేను మిమ్మల్ని టచ్ చేయట్లేదు. మీరే నన్ను టచ్ చేస్తున్నారు. నువ్ చెప్తే నేను వెళ్లను అని శివాజీ అన్నాడు. ఇది కరెక్ట్ కాదు అని శుభ శ్రీ అంది. ఇలా వీళ్లిద్దరి మధ్య సరదాగా మొదలైన గొడవ కాస్తా సీరియస్‍గా అయింది. అయితే శివాజీ నార్మల్‍గానే ఆపేందుకు ట్రై చేశాడు. కానీ, తన పైకి వెళ్లినట్లుగా శుభ శ్రీకి అనిపించడంతో ఆమెకు నచ్చలేదు. శివాజీ చేసిన పనిని తల్చుకుంటూ ఫీల్ అయింది శుభ శ్రీ. కూతురు లాంటి అమ్మాయిపైకి అలా వస్తారా. 'బిడ్డ అని అంటూనే పైపైకి రావడం కరెక్టా? అమ్మాయి దగ్గరకొచ్చి ఎటాక్ చేయడం కరెక్టా? అది గేమ్ కాదు ఓవరాక్షన్' అంటూ ఎమోషనల్ అవుతూ మాట్లాడుకుంది.