Breaking News:-పల్లవి ప్రశాంత్కు బెయిల్.. షరతులు వర్తిస్తాయ్..
బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్కు బెయిల్ లభించింది. నాంపల్లి కోర్టు అతడికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. దీంతో చంచల్ గూడ జైలు నుంచి ప్రశాంత్ రిలీజ్ కానున్నాడు. అయితే పోలీసుల విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. ఆదివారం పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. బిగ్ బాస్ ఫైనల్ తర్వాత జరిగిన గొడవల కేసులో రెండు రోజుల క్రితం పోలీసులు ప్రశాంత్ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో అతడు ఏ1 గా ఉన్నాడు.
ఫైనల్ షో అనంతరం కంటెస్టెంట్స్ అందరూ అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటికి వస్తుంటే.. అభిమానులంతా వీరంగం సృష్టించారు. కార్లు, ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. ఇతర కంటెస్టెంట్స్పై దాడి చేసే ప్రయత్నం చేశారు. . దీన్ని తర్వాత పలు సెక్షన్ల కింద ప్రశాంత్పై కేసులు నమోదు చేసిన పోలీసులు ఈ నెల 20న అరెస్ట్ చేశారు. అదే రోజు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అతన్ని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలో నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిపిన న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.