Pallavi Prashanth arrested:బిగ్‌బాస్‌ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు 14 రోజుల రిమాండ్

Byline :  Veerendra Prasad
Update: 2023-12-21 01:58 GMT

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను బుధవారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. తన స్వగ్రామం అయిన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం కొల్లూరులో అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 17వ తేదీన హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడి ఘటనలో ఏ–1 నిందితుడిగా ఉన్న పల్లవి ప్రశాంత్ , ఏ–2 నిందితుడుగా ఉన్న అతని తమ్ముడిని అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరిని నిన్న రాత్రి జూబ్లీహిల్స్ పీఎస్ లో కాసేపు విచారించిన తర్వాత... అర్ధరాత్రి వేళ న్యాయమూర్తి ఎదుటు హాజరు పరిచారు. జడ్జీ రిమాండ్ విధించడంతో ప్రశాంత్‌ను, అతడి సోదరుడిని హైదరాబాద్‌లోని చంచల్ గూడ జైలుకు తరలించారు. త్వరలోనే కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తుంది. పల్లవి ప్రశాంత్‌పై మొత్తం 9 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

మరోవైపు జూబ్లీహిల్స్‌ ఎస్‌ఎస్‌ఐ మెహర్‌ రాకేశ్‌ ఫిర్యాదు మేరకు దాడి ఘటనలో ప్రమేయమున్న నరేందర్, అతని స్నేహితుడు వినయ్, కారు డ్రైవర్లు సాయికిరణ్, ఎ.రాజుపై కేసు నమోదు చేశారు. అందులో సాయికిరణ్, రాజులను ఈనెల 19న అరెస్టు చేసి బుధవారం కోర్టులో హాజరుపరచగా.. వారికి 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఈనెల 17న బిగ్‌బాస్‌ సీజన్‌ –7 ఫైనల్స్‌లో భాగంగా జూబ్లీహిల్స్‌ అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్‌ వద్దకు పల్లవి ప్రశాంత్, రన్నరప్‌ అమర్‌దీప్‌ అభిమానులు చేరుకోగా అందులోని కొంతమంది ఆకతాయిలు రాళ్లను తీసుకుని బిగ్‌బాస్‌ సీజన్‌ 6 లో పాల్గొన్న గీతూ రాయల్, ప్రస్తుత సీజన్‌ కంటెస్టెంట్‌ అశ్వినీ కార్లను, ఆరు ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News