Varthur Santosh : బిగ్‌బాస్ షోలో కంటెస్టంట్‌ అరెస్ట్.. కామెడీ కాదు రియల్.. ఏడేళ్లు జైలు!

Update: 2023-10-23 11:41 GMT

బిగ్‌ బాస్‌ రియాలిటీ షోలో టాస్క్‌లు ఇవ్వడం, పూర్తి చేయడానికి కంటెస్టంట్లు తిప్పడం పడ్డం మామూలే. అయితే కన్నడ బిగ్ బాస్‌ సీజన్ 10 షోలోకి టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రవేశించి ఓ కంటెస్టంటుకు చుక్కలు చూపించారు. అరెస్ట్ చేసి ‘హౌస్’ నుంచి ‘జైలు’కు పట్టుకెళ్లారు. ఆదివారం రాత్రి షో మధ్యలో ఈ సంఘటన జరిగింది.

కన్నడ బిగ్ బాస్‌ షోలో పాల్గొటున్న వర్తుర్ సంతోషన్ అనే రైతు మెడలో పులిగోరు కనిపించడంతో అటవీ శాఖ అధికారులు ఆరా తీశారు. అది నిజమైందా, కాదా అని తేల్చుకోడానికి షోలోకి సినీ ఫక్కీలో ప్రవేశించారు. సంతోష్ మెడలోని లాకెట్లో ఉన్నది అసలైన పులిగోరే అని నిర్ధారించుకుని అరెస్ట్ చేశారు. గోరును మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని, సంతోష్ అక్రమాలకు పాల్పడినట్టు తేలింతే కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సంతోష్‌పై వన్యప్రాణి సంరక్షణ చట్ట ఉల్లంఘన కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే మూడు నుంచి ఏడేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. రైతునని చెప్పుకే సంతోషన్ దగ్గర నానా జాతులు జంతువులు ఉన్నాయి. అఖిల భారత గోసంరక్షణ కమిటీ ప్రెసిడెంట్‌గా పనిచేసిన సంతోష్ ‘హల్లికర్’ జాతి ఎద్దుల సంరక్షణ కోసం ఓ సంఘం పెట్టాడు. అతనికి స్మగ్లర్లు పులిగోరు అమ్మి ఉంటారని, వారితో అతనికి సంబంధాలు ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. కన్నడ బిగ్ బాస్ షోకు ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్ హోస్ట్ గా వ్యవవహరిస్తున్నాడు.


Tags:    

Similar News