ప్రేయసితో ఏడడుగులు.. ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసిన కమెడియన్
టాలీవుడ్ కమెడియన్ మహేశ్ విట్టా (Mahesh Vitta ) కొత్త జీవితంలో అడుగుపెట్టాడు. తన ప్రేయసి శ్రావణి రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశాడు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని హెల్త్ క్లబ్ ఫంక్షన్ హాల్‌లో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో శనివారం (సెప్టెంబర్ 2) వీరి వివాహం ఘనంగా జరిగింది. మహేశ్ తాజాగా ఈ ఫొటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నాడు. నెటిజన్లు నూతన వధూవరులకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ పెళ్లికి బిగ్‌బాస్ సీజన్3కు చెందిన కొందరు హాజరయ్యారు. శ్రావణి .. మహేష్ చెల్లెలి ఫ్రెండ్ అని తెలుస్తుంది. ఆ రకంగా వీరి మధ్య పరిచయం ఏర్పడటం.. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి పెళ్లిచేసుకున్నారు. వీరిద్దరి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించిన కొంతకాలంలోనే టెలివిజన్‌లోకి అడుగుపెట్టాడు మహేశ్ విట్టా. ఆ తర్వాత బిగ్‌బాస్‌లో 60 రోజులకు పైగా ఉండి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రాయలసీమ యాసతో అందరినీ అలరించే మహేశ్.. పలు సినిమాల్లోనూ కనిపించి నవ్వించాడు. నాని హీరోగా తెరకెక్కిన ‘కృష్ణార్జున యుద్ధం’ అతడికి కమెడియన్‌గా మంచి పేరు తీసుకువచ్చింది. ఆ తర్వాత ‘శమంతకమణి’, ‘టాక్సీవాలా’, ‘చలో’, ‘కొండపొలం’, ‘అల్లుడు అదుర్స్’ వంటి సినిమాల్లో కనిపించాడు.’పుష్ప’ సినిమాలో కేశవ పాత్ర మొదట ఇతనికే లభించింది. కానీ కొన్ని కారణాల వల్ల దానిని మిస్ చేసుకున్నాడు మహేష్. ఇక మహేష్ ప్రస్తుతం కొన్ని సినిమాల్లో చేస్తున్నాడు..