Bigg Boss7: రతిక నా కొడుకును వాడుకుంటుంది: పల్లవి ప్రశాంత్ తల్లి
బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా సాగుతుంది. ప్రతి రోజూ కొత్తగా ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తుంది. ఒక్కో కంటెస్టెంట్ తమ గేమ్ ప్లేతో ఆడియన్స్ హృదయాలను దోచుకుంటున్నారు. ఇక కామన్ మ్యాన్, రైతు బిడ్డగా హౌస్ లోకి అడుగు పెట్టిన పల్లవి ప్రశాంత్ దూసుకు పోతున్నాడు. హౌస్ మేట్స్ అందరూ తనను టార్గెట్ చేసినా, అంతా కలిసి వరుసగా నామినేట్ చేసినా ఆడియన్స్ ప్రశాంత్ కు అండగా నిలుస్తున్నారు. ఓటింగ్ లో ప్రశాంత్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఇటీవల నామినేషన్ ఎపిసోడ్ లో అంతా ప్రశాంత్ ను తిట్టడం, ఆ నెగిటివిటీ కూడా అతనికి ప్లస్ పాయింట్ అయింది. ప్రస్తుతం టాప్ లో కొనసాగుతున్న ప్రశాంత్ కు క్రేజ్ కూడా ఆరేంజ్ లోనే ఉంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రశాంత్ తల్లి.. అతనికి వస్తున్న ఆదరణ చూసి ఆనందం వ్యక్తం చేసింది.
హౌస్ లో ప్రశాంత్ ఆట, రతిక ప్రశాంత్ ల మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ‘ప్రశాతం తల్లిగా నేను గర్వ పడుతున్నా. అతనికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఓ పాట తీస్తే దాన్ని వేరే వాళ్లు అమ్ముకున్నారు. దాంతో నా కొడుకు చాలా బాధపడ్డాడు. యాక్టింగ్ పై ప్రశాంత్ కు ఉన్న ఇష్టం చూసి అప్పు చేసి ఓ ఫోన్ కొనిచ్చాం. దాంతో వీడియోలు చేస్తూ.. బిగ్ బాస్ వరకు వచ్చాడు. ఆ ఫోన్ నా బిడ్డ జీవితాన్ని మార్చేసింది. ప్రశాంత్, రతికల మధ్య ఏం లేదు. నా కొడుకు అందరినీ అక్కా చెల్లి అనే భావంతో చూస్తాడు. రతికనే ప్రశాంత్ ను వాడుకుంటుంది. నా కొడుకుకు ఆడియన్స్ లో ఫేమ్ ఉంది. తనతో మంచిగా ఉంటే.. అతనికి వచ్చే కొన్ని ఓట్లు రతిక వైపు మళ్లుతాయని ప్లాన్ చేసింది’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రశాంత్ తల్లి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.