SOLO BOY : బిగ్ బాస్ టు సిల్వర్ స్క్రీన్.. హీరోగా గౌతమ్ కృష్ణ

Byline :  Babu Rao
Update: 2024-02-07 12:41 GMT

బిగ్ బాస్ సీజన్ 7తో ఫేమ్ అయిన డాక్టర్ గౌతమ్ కృష్ణ హీరోగా మారాడు. గౌతమ్ హీరోగా ‘సోలో బాయ్’ అనే టైటిల్ తో రెండో సినిమా రాబోతోంది. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సెవెన్ హిల్స్ సతీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి పి. నవీన్ కుమార్ దర్శకుడు. విశేషం ఏంటంటే.. గౌతమ్ తో పాటే సీజన్ 7లో పార్టిసిపెంట్ గా ఉన్న ఆట సందీప్ ఈ మూవీకి కొరియోగ్రఫీ చేస్తున్నాడు. ఇక తాజాగా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేసింది మూవీ టీమ్. ఈ పోస్టర్ చూస్తే గౌతమ్ కాలేజ్ గోయింగ్ కుర్రాడిలా కనిపిస్తున్నాడు. ఈ లుక్ లో అతను చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు.

ఈ సందర్భంగా నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ మాట్లాడుతూ.. ‘‘కోవిడ్ టైంలో నేను బట్టల రామస్వామి బయోపిక్ అనే సినిమా తీశాను. కోవిడ్ పాండమిక్ టైం లో ఓటిటి ద్వారా ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం. తర్వాత ఒక మంచి కథ కోసం ఎదురు చూస్తున్న టైం లో ఈ కథ నచ్చి మీ ముందుకు తీసుకుని వచ్చాం. ఈ జెనరేషన్ ఆడియెన్స్ చూడాల్సిన సినిమా. వాళ్లకు ఈజీగా కనెక్ట్ అయ్యే అంశాలు ఉంటాయి. రెండు పాటలు మినహా పూర్తి చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాతో గౌతమ్ మళ్లీ మీ ముందుకు వస్తున్నాడు గతంలో ఆకాశవీధిలో సినిమాతో అలాగే బిగ్ బాస్ 7 లో ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడు. ఇప్పుడు సోలో బాయ్ సినిమాతో మళ్లీ మీ ముందుకు రాబోతున్నాడు. ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ తో వచ్చాం ఫ్యూచర్లో టీజర్, ట్రైలర్ తో మీ ముందుకు వస్తాం. సో ఈ సినిమాని ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఈ సినిమా చూసి బయటకు వచ్చేప్పుడు కనీసం పది నిమిషాలు ఆలోచిస్తారు.’’ అన్నారు.

హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘ గతంలో ఆకాశవీధిలో చేసినప్పుడు నటుడిగా మంచి గుర్తింపు వచ్చంది.తర్వాత వేరే కథలు వింటున్నప్పుడు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. జనాలు నన్ను బాగా ఆదరించారు. ఈ రోజు మా సినిమా "సోలో బాయ్" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కావడం హ్యాపీగా ఉంది.ముందు ముందు టీజర్ ట్రైలర్ ప్రమోషన్స్ తో కొత్తగా మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. మా సినిమా అనుకున్న దానికంటే బాగా రూపొందించాం. ఈ సినిమా చేస్తూ చేస్తూ మేమూ మూవీతో కనెక్ట్ అయ్యాం. తెలుగు ప్రేక్షకులకు మంచి టేస్ట్ ఉంది. మంచి సినిమాలను తప్పకుండా ఆదరిస్తారు. గతంలో ఆకాశవీధిలో, బిగ్ బాస్ తో ఎలా అయితే ఆదరించారో ఇప్పుడీ సినిమాతో కూడా అలాగే ఆదరించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాని సెవెన్ హిల్స్ సతీష్ గారు ప్రొడ్యూస్ చేయడం ఆనందంగా ఉంది..’’ అన్నారు.

Tags:    

Similar News