BIGG BOSS 7: లీస్ట్ ప్లేస్‌లో ప్రియాంక, టేస్టీ తేజ
బిగ్ బాస్ సీజన్ 7.. నాలుగు వారాలు సక్సెస్‌ఫుల్‌గా ముగించుకుని ప్రస్తుతం ఐదో వారంలో అడుగు పెట్టింది. ఈ వారం నామినేషన్‌లో టేస్టీ తేజా, శుభశ్రీ, ప్రియాంక, అమర్ దీప్, యావర్, గౌతమ్ కృష్ణ, శివాజీ ఉన్నారు. ఈ సీజన్ 7లో శివాజీ మినహాయిస్తే.. మిగిలిన వాళ్లంతా ఆటలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం లేదు. శివాజీ మాత్రం బిగ్ బాస్ హౌస్‌లో ఎలా ఉంటే.. టాప్‌లో ఉండొచ్చో పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నాడు. ఆడియన్స్‌ని మామూలుగా అడుక్కుంటే ఓట్లు రావు అని.. ‘నాకు ఓటు వేయొద్దు.. ప్లీజ్ నన్ను ఎలిమినేట్ చేసేయండి’ అని చెబుతూ తనపై పాజిటివ్ ఓపినియన్ వచ్చేలా ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంటున్నాడు. గతవారం సీరియల్ బ్యాచ్ అంతా కలిసి.. శివాజీ పవర్ అస్త్ర పోవడానికి కారణం అయ్యారు. ఆ దెబ్బతో కామన్ ఆడియన్స్ మొత్తం.. అయ్యో పాపం శివాజీ ) అంటూ అతని వైపుకి మళ్లారు. అమర్ దీప్, సందీప్, ప్రియాంక, శోభాశెట్టి.. ఈ సీరియల్ బ్యాచ్ అంతా మాటలు తప్పితే ఆట లేదు. ఇదే తనకు అనుకూలంగా మార్చుకుని ఓటింగ్‌లో దుమ్ముదులిపేస్తున్నాడు శివాజీ.
సోమవారం రాత్రి నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ఈ ఓటింగ్ లో ప్రేక్షకులు... శివాజీకి ఓట్లు గుద్ది పడేస్తున్నారు. మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉంటే.. సగానికి సగం ఓట్లు శివాజీకే పడుతుండటం విశేషం. శుక్రవారం అర్దరాత్రి వరకూ ఈ ఓటింగ్ లైన్స్ ఓపెన్‌లో ఉండగా.. సోమ, మంగళవారం ఓటింగ్‌లో శివాజీకి ఎక్కువ శాతం(32 శాతం) ఓట్లు పడుతున్నాయి.
ఓటింగ్‌ని బట్టి చూస్తే.. శివాజీ టాప్‌లో కొనసాగుతున్నాడు. అయితే ప్రియాంక, టేస్టీ తేజాలు లీస్ట్ ఓటింగ్‌లో ఉన్నారు. నిజానికి గత వారమే టేస్టీ తేజా ఎలిమినేషన్ గండం నుంచి గట్టెక్కాడు. ఈవారం నేరుగా నామినేట్ అయ్యి జైలులో ఉన్నాడు. ఆ సింపథీ ఏమైనా వర్కౌట్ అయితే సరేసరే.. కానీ.. ఇక ఆడింది చాల్లే అనుకుంటే మాత్రం ఈవారం టేస్టీ తేజా ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ప్రియాంక కూడా.. అమర్‌తో దోస్తీ కట్టి అతనిలాగే ఆడకుండా పోయింది. టేస్టీ తేజా, ప్రియాంక ఈ ఇద్దరిలో ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు. ఇంకా ఓటింగ్ మూడు రోజులు ఉంది కాబట్టి.. తేజా, ప్రియాంకలకు మంచి టాస్క్ పడితే మాత్రం ఈ లెక్కలు తారుమారయ్యే అవకాశం ఉంది. ఇక నిన్న జరిగిన గేమ్‌లో మాత్రం శివాజీ తన ఆటతో అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చాడు. బిగ్ బాస్ బత్తాయి జూస్ గేమ్ పెట్టగా.. ఆ టాస్క్‌లో అమర్ , శివాజీ మొదటి ప్లేస్‌లో నిలిచారు.