Bigg Boss Telugu Season 7: సంచాలక్గా ఫెయిల్.. సందీప్కు ఇచ్చి పడేసిన నాగ్

By :  Kiran
Update: 2023-09-23 12:08 GMT

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. మూడోవారం కంటెండర్షిఫ్ సాధించేందుకు, హౌస్ మేట్ అయ్యేందుకు సభ్యుల మధ్య జరిగిన పోటీ ఇంట్రెస్టింగ్గా సాగింది. అయితే సభ్యుల ఆటతీరు అనలైజ్ చేసేందుకు థర్డ్ వీకెండ్లో నాగార్జున ఫుల్ ఫైర్తో వచ్చేశాడు. బిగ్ బాస్ హౌస్మేట్స్, కంటెస్టెంట్స్కు ఇచ్చి పడేశాడు. వీకెండ్ షోలో జనం అడగాలనుకుంటున్న ప్రశ్నలను ఎప్పుడు పట్టించుకోరన్న దురభిప్రాయాన్ని తుడిచేసేలా హోస్ట్ నాగార్జున ఈ వారం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ను కడిగి పారేశాడు. సంచాలక్గా అట్టర్ ఫ్లాపైన ఆట సందీప్ ఇజ్జత్ తీశాడు.

ముందుగా కంటెండర్షిప్ కోసం గుండు చేయించుకునేందుకు నో చెప్పిన అమర్దీప్ను నాగ్ ఏకిపారేశాడు. అసలు గేమ్ నీకోసం ఆడుతున్నావా లేక ప్రియాంక కోసం ఆడుతున్నావా అని నిలదీశాడు. తాను చేస్తే ఒప్పు వేరే వాళ్లు చేస్తే ఒప్పు అనేలా వ్యవహరిస్తున్న అమర్దీప్ పల్లవి ప్రశాంత్పై నోరు పారేసుకోవడాన్ని తప్పుబట్టారు.

ఇక కంటెండర్షిప్ టాస్కులో వీకెస్ట్ కంటెండర్ను ఎలిమినేట్ చేయమని బిగ్ బాస్ సూచించాడు. అయితే శోభా శెట్టి మాత్రం స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అయినందున ప్రిన్స్ యావర్ను ఎలిమినేట్ చేయడంతో అలా ఎందుకు చేశావని నాగ్ ప్రశ్నించాడు. ఆ టాస్క్లో సంచాలక్గా వ్యవహరించిన సందీప్కు అసలు ఆట అర్థమైందా అని ప్రశ్నించాడు. యావర్ స్ట్రాంగ్ అని చెప్పిన శోభ తాను వీక్ అని ఒప్పుకున్నట్లేకదా అన్న నాగ్.. అలాంటప్పుడు ఆమెను ఎందుకు ఎలిమినేట్ చేయలేదని అడగడంతో సందీప్ నీళ్లు నమిలాడు

సంచాలక్గా ఉండి శోభా శెట్టి, ప్రియాంకకు సందీప్ పాయింట్లు చెప్పడంపైనా నాగార్జున ప్రశ్నించాడు. సంచాలక్ గా వ్యవహరించావా లేక పర్సనల్ గేమ్ ఆడావా అంటూ నిలదీశాడు. కన్ప్యూజ్ అయ్యానంటూ సందీప్ కవర్ చేసుకునే ప్రయత్నం చేసినా అంపైర్గా ఉన్న వ్యక్తి అలా అయితే ఎలా అని అన్నాడు. సంచాలక్ అని అనుకోలేదని సందీప్ చెప్పుకునే ప్రయత్నం చేయగా.. నువ్వు పెద్ద పిస్తావని పిలిచారా అని ఇజ్జత్ తీశారు. సంచాలక్ గా ఫెయిల్ అయినందుకుగానూ సందీప్ బ్యాటరీని గ్రీన్ నుంచి ఎల్లోకు తగ్గించాడు.

Tags:    

Similar News