Bigg Boss case: బిగ్బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్

Byline :  Bharath
Update: 2023-12-20 13:48 GMT

బిగ్బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై 9 కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ప్రశాంత్ ను గజ్వేల్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఫైనల్ షో అనంతరం కంటెస్టెంట్స్ అందరూ అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటికి వస్తుంటే.. అభిమానులంతా వీరంగం సృష్టించారు. కార్లు, ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. ఇతర కంటెస్టెంట్స్ పై దాడి చేసే ప్రయత్నం చేశారు. దీనిపై చర్యలు చేపట్టిన పోలీసులు నిన్న బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ కారు డ్రైవర్లతో సహా.. పలువురిపై కేసు నమోదు చేశారు. దాడి జరిగిన అనంతరం పల్లవి ప్రశాంత్ పై సుమోటోగా 6 కేసులు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా ప్రధాన నిందితుడిగా కేసు నమోదు చేశారు.

అతని సోదరుడు, స్నేహితుడిని సైతం నిందితులుగా నమోదు చేసి మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. రెండు కార్లను సీజ్ చేశారు. ఫైనల్ జరిగిన రాత్రి చేసిన దాడులకు పల్లవి ప్రశాంతే కారణమని పోలీసులు తేల్చి.. ఈ కేసులో అతన్ని ఏ-1గా చేర్చారు. ఏ-2గా అతని సోదరుడు మనోహర్, ఏ-3గా అతని స్నేహితుడు వినయ్ లను చేర్చారు. ఏ-4గా ఉప్పల్ మేడిపల్లిలో ఉన్న లాంగ్ డ్రైవ్ కార్స్ లో డ్రైవర్ గా పనిచేస్తున్న సాయికిరణ్, అంకిరావుపల్లి రాజును అరెస్ట్ చేశారు. కాగా పల్లవి ప్రశాంత్ తప్పు చేస్తే ఆధారాలతో సహా కేసు నమోదుచేయాలని అతని తరుపు లాయర్ రాజేష్ కుమార్ అన్నారు.

Tags:    

Similar News