Mithun Chakraborty : గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు
(Mithun Chakraborty) ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి తీవ్ర గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరారు. నేడు ఆయనకు ఒక్కసారి ఛాతిలో నొప్పి రావడంతో కోల్కత్తలోని అపోలో ఆస్పుత్రిలో అత్యవసర విభాగంలో చేరారు. మిథున్ గతంలో కిడ్నీ సమస్యతో బాధపడ్డారు. సుమారు రెండేళ్ల క్రితం బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో ఆయనకు ఆపరేషన్ జరిగింది. మళ్లీ ఇప్పుడు ఛాతీ వద్ద నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్కి తరిలించారు. కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. దీంతో త్వరగా ఆయన కోలుకోవాలని కోరుతూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మిథున్ చక్రవర్తికి 2024 జనవరి 25న కేంద్ర ప్రభుత్వం 'పద్మ భూషణ్' అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. బెంగాలీ కుటుంబానికి చెందిన మిథున్ చక్రవర్తి బాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో నటించి ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందారు. ఒకప్పుడు హీరోగా బెంగాలీ, హిందీ ఇండస్ట్రీలలో దుమ్మురేపిన మిథున్ చక్రవర్తి. శ్రీదేవి సరసన అనేక చిత్రాల్లో నటించారు. 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రంలో మిథున్ మెప్పించిన విషయం తెలిసిందే.