స్టార్ హీరో సల్మాన్ కన్నా ఆయన బాడీ గార్డ్స్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. వీరు చేసే ఓవర్ యాక్టింగ్ అందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో నెటిజన్స్ వీరిని ఏ చిన్న అవకాశం దొరికినా ట్రోల్ చేస్తుంటారు. మొన్నామధ్య సల్మాన్ బాడీగార్డ్స్ బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌషల్‌ను తోసేసిన న్యూస్ నెట్టింట్లో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే . ఈ ఘటన మరువక ముందే మరో బాలీవుడ్ నటి సల్మాన్ బాడీ గార్డ్స్పై ఫైర్ అయ్యింది. సల్మాన్‌తో ఓ ఫోటో అడిగినందుకు తనను దారుణంగా అవమానించారని దబాంగ్ 3 నటి హేమ శర్మ ఆరోపించింది. దీంతో ఇప్పుడు ఈ న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
బాలీవుడ్ నటి హేమ శర్మ సల్మాన్ ఖాన్ చిత్రం దబాంగ్ 3లో నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో నటికి చేదు అనుభవం ఎదురైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటి తనకు జరిగిన అవమానం గురించి చెబుతూ.. " స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సినిమా దబాంగ్3 లో నటించే అవకాశం వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే సల్మాన్‌తో ఫొటో కోసం ఎంతో ట్రై చేశాను. కానీ సల్మాన్ బాడీగార్డ్స్ చాలా ఓవర్ యాక్టింగ్ చేశారు. నన్ను దారుణంగా అవమానించారు. ఫోటో కోసం నేను వెళితే ఏదో కుక్కని తరిమినట్లు నన్ను అక్కడి నుంచి తరిమేశారు. ఆ టైమ్‌లో షూటింగ్ స్పాట్లో కనీసం 100 మంది ఉన్నారు. నాకు జరిగిన అవమానం మారిచిపోవడానికి చాలా సమయం పట్టింది. 10 రోజుల వరకు సరిగా నిద్రపట్టలేదు. అయినా సరే ఆయనతో ఒకేఒక్క ఫొటో కోసం నేను ఎంతో మందిని అడిగాను. బిగ్‌బాస్‌కు వచ్చినప్పుడు సల్మాన్‌తో నా కోరిక చెప్పాను’’ అని హేమశర్మ తెలిపింది. హేమశర్మ కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.