ఆ కొరియోగ్రాఫర్ నన్ను కొట్టింది..ఏడ్చేసిన సోనాలీ బింద్రే

Update: 2023-07-11 06:08 GMT

బాలీవుడ్ భామలు తెలుగులో నటించడం చాలా అరుదు. ఒకవేళ తెలుగు సినిమాల్లో నటించినా చాలా కొద్ది మందికి మాత్రమే స్టార్ ఇమేజ్ దక్కుతుంది. అలా ముంబై నుంచి వచ్చి తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటీమణుల్లో సోనాలి బింద్రే ఒకరు. ప్రేమికుల రోజు, మురారి, ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి హిట్ సినిమాల్లో నటించి తన టాలెంట్, గ్లామర్‎తో ఇండస్ట్రీని షేక్ చేసేసింది ఈ బ్యూటీ. స్టార్ హీరోయిన్‎గా గుర్తింపు సంపాదించుకున్న సోనాలీ బాలీవుడ్‎లోనూ ఎన్నో హిట్ ప్రాజెక్టులను చేసింది. అనంతరం క్యాన్సర్ వ్యాధి బారిన పడిన సోనాలి దానిని ఎంతో ధైర్యంగా గెలిచింది. సినిమాలకు దూరంగా ఉంటున్న సోనాలి, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‎గానే ఉంటుంది. ఇన్‎స్టాగ్రామ్ వేదికగా అప్పుడప్పుడు ఎమోషనల్ విషయాలను పంచుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ త డాన్సింగ్ గురువు గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. భావోద్వేగానికి లోనైంది




 


దివంగత కొరియోగ్రాఫర్, తన గురువు సరోజ్ ఖాన్‌ను తలచుకుని మరోసారి ఎమోషనల్ అయింది బాలీవుడ్ నటి సోనాలి బింద్రే. సరోజ్ ఖాన్‎తో మొదటిసారిగా వర్క్ చేసిన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది." 1999లో విడుదలైన ‘దిల్ హాయ్ దిల్ మే’ సినిమాలోని ‘చాంద్ ఆయా హై’ సాంగ్ కు సరోజ్‌గారితో నేను మొదటిసారి వర్క్ చేశాను. ఫస్ట్ టైమ్ ఆమెను చూసినప్పుడు నాకు భయం మేసింది. ఈ సాంగ్‎లో నేను గర్బా డ్యాన్స్ చేయాలి . ఆ డ్యాన్స్ నేనెప్పుడూ చేయలేదు అదే తొలిసారి.ఆ సాంగ్‎ను అప్పట్లో సరోజ్ జీ కొరియోగ్రఫీ చేశారు. సాంగ్ ‎లో నేను ఏదైనా తప్పు చేస్తే ఆమె వెంటనే దాండియా స్టిక్స్‎ను నాపైకి విసిరేది. తప్పు అని ఆమె తన గంభీరమైన స్వరంతో చెప్పినపుడు నేను చాలా భయపడ్డాను" అంటూ సరోజ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యింది సోనాలి. ఆమె లేని లోటును ఇండస్ట్రీలో ఎవరూ తీర్చలేరని బాధపడ్డారు.




 





 


Tags:    

Similar News