బాలీవుడ్ బ్యూటీ, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌కు బీజేపీ ఎంపీ టికెట్ ప్రకటించింది. ఈ విషయం తెలిసి ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సినీ సెలబ్రిటీస్ పాలిటిక్స్ లోకి రావడమనేది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటికే కొందరు సినిమా వాళ్లు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా చేరిపోనుంది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీలుగా హీరోయిన్లు తమ లక్‌ను పరీక్షించుకోనున్నారు. హుగ్లీ నుంచి మరో హీరోయిన్ రచన బెనర్జీ తృణమాల్ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. తమిళనాడులో విరుధ్ నగర్ నుంచి రాధిక శరత్ కుమార్ ఎంపీగా బరిలో ఉన్నారు.
ఇక చిరుత మూవీలో రామ్ చరణ్ సరసన నటించిన మరో హీరోయిన్ నేహా శర్మ.. బీహార్ లోని భాగల్ పూర్ నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు కంగనా రనౌత్‌కు కూడా బీజేపీ నుంచి టికెట్ కన్ఫామ్ అయ్యింది. హిమాచల్ ప్రదేశ్ లోని మండీ ప్రాంతం నుంచి ఆమె ఎంపీగా పోటీలో ఉన్నారు. ఎప్పటి నుంచో కంగనా బీజేపీకి సపోర్ట్ చేస్తూనే ఉంది.
కంగనా నటనకు గాను బీజేపీ సర్కార్ ఆమెకు పద్మశ్రీని కూడా ఇచ్చి సత్కరించింది. అప్పటి నుంచి ఆమె బీజేపీలో యాక్టీవ్‌గా ఉన్నారు. 2006లో అనురాగ్ బసు డైరెక్షన్‌లో 'గ్యాంగ్ స్టర్' మూవీతో ఎంట్రీ ఇచ్చిన కంగనా 'క్వీన్' సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. 'ఫ్యాషన్' మూవీలో ఆమె నటనకు గాను జాతీయ అవార్డు కూడా వచ్చింది. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకోవడంతో ఆమెకు 2020లో పద్మశ్రీ వచ్చింది. తెలుగులో కంగనా ప్రభాస్ సరసన 'ఏక్ నిరంజన్' మూవీలో నటించింది.