థంబ్ : బాలయ్యకు కలిసొస్తున్న లియో ప్రమోషన్స్
స్టార్ హీరోలు బాక్సాఫీస్ వార్ లో తలపడితే ఆడియన్స్ లో ఉండే మజానే వేరు. కలెక్షన్స్, రికార్డ్స్ సంగతి ఆడియన్స్ కు అనవసరం. అది ఫ్యాన్స్ చూసుకుంటారు. ప్రొడక్షన్ హౌస్ లలో తేలుతుంది. బట్ ప్రేక్షకులు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ విషయంలో దసరాకు ముందే ధమాకా రాబోతోంది. ఒకే రోజు రెండు సినిమాలతో బాక్సాఫీస్ కళకళలాడబోతోంది. బట్ వార్ లా చూస్తే ఇది భగవంత్ కేసరి వర్సెస్ లియో. ఈ రెండిటిలో విన్నర్ ఎవరు అవుతారని ఈజీగానే ఊహించొచ్చు.
కొన్ని కాంబినేషన్సే అంచనాలు పెంచుతాయి. అలాంటిదే బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబో. వీరి కాంబోలో భగవంత్ కేసరి అనౌన్స్ అయినప్పుడు ఆసక్తి పెరిగింది. అదే టైమ్ లో ఎవరి ఇమేజ్ కు తగ్గట్టుగా సినిమా ఉంటుందా అనే క్యూరియాసిటీ కూడా కలిగింది. ఒక్కో అప్డేట్ వస్తున్నప్పుడు ఆశ్చర్యపోవడం ప్రేక్షకుల వంతు అన్నట్టుగా ఇది ఇద్దరి ఇమేజ్ లకు భిన్నమైన కంటెంట్ అని చెప్పకనే చెబుతూ వచ్చారు. చివరగా ట్రైలర్ చూసినప్పుడు ష్యూర్ షాట్ అనిపించుకున్నారు. ఎందుకంటే ఇది ఇద్దరి ఇమేజ్ బౌండరీస్ ను దాటి చేసిన సినిమా అని ట్రైలర్ తోనే అర్థం అయింది. బాలయ్య ఇప్పటి వరకూ చేసిన కంటెంట్స్ కు పూర్తి భిన్నంగా ఉంది. అనిల్ రావిపూడి సినిమాల్లో యాక్షన్ ఉన్నా.. ఎంటర్టైన్మెంట్ కు ఎక్కువ స్పేస్ ఉండేది. బట్ ఈ సారి అదేం కనిపించడం లేదు. ముఖ్యంగా బాలకృష్ణ ఫస్ట్ టైమ్ తన ఏజ్ కు తగ్గ గెటప్ లో కనిపించడం ఫ్యాన్స్ కే కాకుండా ఇతర హీరోల అభిమానులకూ నచ్చింది. ట్రైలర్ తర్వాత ఈ మూవీపై అంచనాలు రెట్టింపయ్యాయి . దీనికి తోడు ఆల్రెడీ వినిపిస్తోన్న కొన్ని రివ్యూస్ చూస్తే భగవంత్ కేసరి బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశం ఉందంటున్నారు.
ఇక భగవంత్ కేసరితో పాటు 19నే విడులవుతోన్న లియోపైనా అంచనాలున్నాయి. కాకపోతే ట్రైలర్ తర్వాత అవి కాస్త తగ్గాయి అనేది నిజం. విజయ్ కి కొన్నాళ్లుగా తెలుగులో మంచి మార్కెట్ ఫామ్ అవుతోంది. దానికి తోడు ఆల్రెడీ ఖైదీ, విక్రమ్ తో తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అందుకున్న లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో లియోతో మరో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనుకున్నారు. బట్ అలాంటి సందడి ఏం కనిపించడం లేదు. తెలుగులో అస్సలు ప్రమోషన్స్ చేయలేదు. ఒక చిన్న ఇంటర్వ్యూ అటు దర్శకుడు కానీ, ఇతర టెక్నీషియన్స్ తో కానీ ప్లాన్ చేయలేదు. అందువల్ల అంచనాలు తగ్గాయి అనుకోవచ్చు. అయితే విశేషం ఏంటంటే.. ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోతున్నాయి. అదెలా సాధ్యం అనేదే విశ్లేషకులకూ అర్థం కావడం లేదు. ఏదేమైనా ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఉంటుంది. కానీ దాన్ని భారీ పోటీ అనలేం. సో.. ఇది భగవంత్ కేసరికే అడ్వాంటేజ్ అవుతుందనడంలో డౌటే లేదు.