Skanda glimpse: అఖండను మించి యాక్షన్, మ్యూజిక్.. బోయపాటి మాస్ ఫీస్ట్ పక్కా
చాక్ లెట్ బాయ్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో.. శ్రీలీల కథానాయికగా రాబోతున్న సినిమా స్కంద. ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తూ ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేసింది సినిమా బృందం. అందులో అఖండ సినిమాను మించిన యాక్షన్, ఎలివేషన్స్, మాస్ ఫైట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. బోయపాటి ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. దానికి తోడు ఎస్ఎస్ తమన్ మాస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఈ సినిమాకు ప్లస్ పాయింట్ కానుంది. చేతిలో కత్తి, పంచతో రామ్.. గ్లింప్స్ లో కొత్తగా కనిపించబోతున్నాడు.
‘మీరు దిగితే ఊడేదుండదు.. నేను దిగితే మిగిలేదుండదూ’ అంటూ రామ్ చెప్పిన డైలాగ్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక అఖండ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ అందించిన డైరెక్టర్ బోయపాటి శ్రీను, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంబోలో మరో భారీ హిట్ పక్కా అని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 15న ఈ సినిమా.. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది.