ANRCentenary Celebrations : అక్కినేని నాగేశ్వరరావు కారణజన్ముడు..బ్రహ్మానందం

Byline :  Aruna
Update: 2023-09-20 07:30 GMT

టాలీవుడ్ దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు హైదరాబాద్‎లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో అట్టహాసంగా జరుగుతున్నాయి. శతజయంతి ఉత్సవాల సందర్భంగా అక్కినేని విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్‎తో పాటు సినీ ప్రముఖులు అల్లు అరవింద్‌, బ్రహ్మానందం, మురళీమోహన్‌, జయసుధ, మోహన్‌బాబు, శ్రీకాంత్‌, జగపతిబాబు, రామ్‌ చరణ్‌, రాజేంద్రప్రసాద్‌, మహేశ్‌ బాబు, రానా, విష్ణు, నాని, దిల్‌ రాజు, రాజమౌళి, కీరవాణి, సుబ్బిరామిరెడ్డి, డీజీపీ అంజనీకుమార్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం అక్కినేని నాగేశ్వరరావు గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏఎన్ఆర్ కారణజన్ముడని ఆయన్ని కొనియాడారు.

ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో బ్రహ్మానందం మాట్లాడుతూ.." ఓ రైతు కుటుంబంలో పుట్టి అద్భుతమైన స్థితికి అక్కినేని నాగేశ్వరరావు చేరుకున్నారు. ఇది సామాన్యమైన విషయం కాదు. నటన అనే చిన్న అర్హతతో మహోన్నత వ్యక్తిగా ఎదిగారు. ఎంత పేరు ఉన్నా, కీర్తి అందుకున్నా అక్కినేని నాగేశ్వరరావు సర్వసాధారణంగా ఉంటారు. ఆయన ఎంతో కఠినమైన క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ఏఎన్‎ఆర్‎కు వచ్చినన్ని అవార్డులు ఇంకెవరికీ రాలేదని. ఆయన పొందిన సన్మానాలు మరెవరికీ జరగలేదు. అలాంటి వ్యక్తి విగ్రహావిష్కరణ చూడటమే మహాభాగ్యం"అని బ్రహ్మానందం అన్నారు. 


Tags:    

Similar News