డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. సలార్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి క్రేజ్ మామూలుగా లేదు. ఆదిపురుష్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ లో హైప్ పెరిగిపోయింది. ఈ సినిమాతో ప్రభాస్ కు భారీ హిట్ దొరుకుతుందని ఆశిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ తో హైప్ మరింత పెరిగిపోయింది. ఈ క్రమంలో సినిమాలోని కొందరి పాత్రలను రివీల్ చేసింది మూవీ టీం. ఏ ఏ యాక్టర్ ఏ పాత్ర పోషిస్తున్నాడో కూడా తెలిపింది. ఈసారి సలార్ నుంచి మరో క్రేజీ అప్ డేట్ విడుదల అయింది.
సలార్ సినిమాలో కమెడియన్ బ్రహ్మీజీ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సినిమా మొదటి భాగం చివర్లో తన సన్నివేశాలు ఉంటాయని చెప్పాడు. అంతేకాకుండా చాలా రోజుల తర్వాత ఈ సినిమా ద్వారా నెగిటివ్ పాత్రలో కనిపిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. కాగా, ఈ సినిమాలో జగపతిబాబు, శ్రియారెడ్డి, పృథ్వీరాజ్, హీరోయిన్ గా శృతి హసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది. మరోసారి బిగ్ అప్ డేట్ రిలీజ్.. ఆడియన్స్ లో జోష్ వచ్చింది. కాగా, ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కానుంది.