‘కలియుగం పట్టణంలో' మూవీకి బ్రేక్..త్వరలో కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్

Byline :  Shabarish
Update: 2024-03-30 05:22 GMT

హీరో విశ్వ కార్తికేయ, హీరోయిన్ ఆయుషి పటేల్ నటిస్తున్న చిత్రం కలియుగం పట్టణంలో. ఈ మూవీని నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. రమాకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ఆయనే కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. మార్చి 29న విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే అనివార్య కారణాల వల్ల థియేటర్లలో ఈ మూవీని నిలిపివేశారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకున్న ఈ మూవీని ప్రస్తుతానికి థియేటర్లలో ఆపారు. ఆకట్టుకునే స్క్రీన్ ప్లే, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. హీరో విశ్వ కార్తికేయ నటన అందరినీ ఆకట్టుకుంది. నూతన దర్శకుడైనా కూడా అనుకున్న కథ, సినిమాను అద్భుతంగా తీశారు. సినిమా తీసిన విధానానికి ఆడియన్స్ ఫిదా అయ్యారని చెప్పాలి. అయితే అనివార్య కారణాల వల్ల ఈ చిత్రాన్ని నిలిపి వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మళ్లీ ఈ మూవీ రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాతలు తెలియజేశారు.

Full View

Tags:    

Similar News