మెగా హీరోలు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన చిత్రం ‘బ్రో’. తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన వినోదయ సీతమ్ మూవీకి తెలుగు రీమేక్ బ్రో. తమిళ ఒరిజినల్ సినిమాను డైరెక్ట్ చేసిన సముద్రఖని ఈ మూవీకీ డైరెక్టర్‌గా వ్యవహరించారు. టాలీవుడ్ యువ కథానాయికలు కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్లు కథానాయికులుగా కనిపించారు. ఈ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు స్క్రీన్ ప్లే బాధ్యతలను నిర్వహించారు. బ్రో మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా చూసిన పవన్ ఫ్యాన్స్ ట్విటర్ వేదికగా తమ రివ్యూలను అందిస్తున్నారు. మరి బ్రో కథ ఎలా ఉంది? పవర్ స్టార్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టాడా? సాయి ధరమ్ తేజ్‌కు మరో హిట్ ఖాతాలో పడినట్లేనా? మాటల మాంత్రికుడి మ్యాజిక్ కనిపించిందా? సముద్రఖని డైరెక్షన్ ఎలా ఉందో ట్విటర్ రివ్యూలో మనమూ తెలుసుకుందాం పదండి.
#bro is a powerstar film but lot of lag and many unnecessary scenes makes a below par movie thaman music stands out may be a below average fare for others and vintage papk for fans#BroTheAvatar
— Gowtham (@gowthamreddy25) July 28, 2023
బ్రో టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా భారీగానే నిర్వహించడంతో ‘బ్రో’పై ఓ రేంజ్లో హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల నడుమ సిసిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. ట్విటర్‌లో ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది. కొంత మంది మూవీ యావరేజ్‌గా ఉందని అంటున్నారు. కథ బాగున్నప్పటికీ సినిమాలో కొన్ని అనవసరపు సన్నివేశాలను కూర్చడం వల్ల యావరేజ్ టాక్ వినిపిస్తోంది. మ్యూజిక్ పరంగానూ తమన్ బ్రో లో మ్యాజిక్ చేయేకపోయాడు. ఓవరాల్‌గా పవన్ ఫ్యాన్స్‌కి మాత్రం ఈ సినిమా నచ్చుతుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
#BRO First half review highlights:-
— CinephileX (@CinephileX) July 27, 2023
1) Vintage Pawan mannerisms 🤙💥
2) Total fun filled👌
3) Bromance between mama alludu👍👍
4) Taman music K**Ramp 💥🔥🔥#BroTheAvatar#BroReview#PawanaKalyan #SaiDharamTej #ketikasharma#PriyaPrakashVarrier
‘బ్రో’ చిత్రం బాగుంది. ఫస్టాఫ్లోరి కామెడీ సీన్స్ అదిరిపోయాయి. పవన్, సాయి ధరమ్ తేజ్ మధ్య బ్రోమాన్స్ బాగా వర్కౌట్ అయింది. ఫస్టాఫ్ ఫన్ ఉన్నా సెకండాఫ్‌లో మాత్రం ఆడియెన్స్ ఎమోషల్‌గా ఫీల్ అయ్యే సీన్లు ఉన్నాయి. అదే సమయంలో లాగ్ ఎక్కువగా ఉండటంతో కాస్త సినిమా బోర్ కొట్టిస్తుందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
#BroTheAvathar is just good 👍
— Lokie (@LokeshD33384473) July 28, 2023
If you are expecting mass, just leave the theatre, basically an emotional movie with few laughs. @PawanKalyan entry 💥💥
Overall it's good 👌#BroTheAvatar#BroTimeStarts #BRO
For more filmy content and exclusive updates follow me❤️💙 pic.twitter.com/KbO6XtZWgO
ఫస్టాఫ్ మొత్తం పవన్ కల్యాణ్‌దే. తన మేనరిజం, కామిక్ సెన్స్‌తో ప్రేక్షకులను అలరించాడని టాక్. అయితే పవన్ ఫ్యాన్స్‌ను మినహాయిస్తే సాధారణ ప్రేక్షకులకు సినిమా అంతగా ఎక్కకపోవచ్చంటున్నారు నెటిజన్స్. బ్రోలో కేవలం పవన్ ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకునే కొన్ని సీన్స్ జోడించారట. అవి సాధారణ ప్రేక్షకులు ఇబ్బంది ఫీల్ అయ్యేలా చేశాయని మరికొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.