సినిమా ప్రియులకు శుభవార్త. రూ.99కే మల్టీప్లెక్స్ లో సినిమా టికెట్ పొందే సువర్ణ అవకాశం. అక్టోబర్ 13న జాతీయ సినిమా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. మల్టీఫ్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ ప్రకటన చేసింది. అక్టోబర్ 13వ తేదీ ఒక్క రోజు దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్సుల్లో కేవలం రూ.99కే టికెట్స్ అమ్ముతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే వర్తిస్తుందని ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఈ ఆఫర్ కింద దాదాపు 4వేల కంటే ఎక్కువ స్క్రీన్ లలో రూ.99కే సినిమా టికెట్ బుక్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాలతో పాటు.. అక్టోబర్ 13న రిలీజయ్యే సినిమాలకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలీస్, మిరాజ్, సిటీప్రైడ్, ఏషియన్, ముక్తా ఏ2, మూవీ టైమ్, వేవ్, ఎం2కే, డిలైట్ వంటి ప్రముఖ మల్టీప్లెక్స్ లలో ఈ ఆఫర్ ను తీసుకొచ్చింది. అయితే కేవలం ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకున్నవాళ్లకు మాత్రమే ఈ ఆఫర్ అప్లికెబుల్ అని తెలిపింది.
National Cinema Day is back on October 13th. Join us at over 4000+ screens across India for an incredible cinematic experience, with movie tickets priced at just Rs. 99. It's the perfect day to enjoy your favorite films with friends and family. #NationalCinemaDay2023 #13October pic.twitter.com/Pe02t9F8rg
— Multiplex Association Of India (@MAofIndia) September 21, 2023