‘ఓ మై గాడ్2’కు సెన్సార్ షాక్.. ఆ మార్పులు చేయకపోతే..

Update: 2023-08-01 12:31 GMT

బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన సినిమా ఓ మై గాడ్. 2012లో విడుదలైన ఈ సినిమా.. ఎన్నో వివాదాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా ఓ మై గాడ్2 రాబోతోన్న విషయం తెలిసిందే. అందులో యామీ గౌతమ్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్ర పోషిస్తున్నారు. అక్షయ్ కుమర్ గాడ్ రోల్ పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. కాగా, ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో భాగంగానే ఈ సినిమాను సెన్సార్ బోర్డుకు పంపించారు.

ఈ క్రమంలో ఓ మై గాడ్2కు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ ఇచ్చింది. అంతేకాకుండా సినిమాలోని మొత్తం 27 సీన్స్ పై అభ్యంతరం వ్యక్తం చేసింది. సెన్సార్ రూల్స్ కు విరుద్ధంగా ఉన్న 13:51 ఫుటేజ్ ను డిలీట్ చేసి.. వాటి స్థానంలో 14:01 నిమిషాల సీన్లను యాడ్ చేయాలని సూచించింది. ఈ పరిణామాల మధ్య.. ఓ మై గాడ్2 కూడా.. వివాదాస్పదమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటిని చిత్ర బృందం ఎలా ఎదుర్కుంటుంది? ఏ జవాబు ఇస్తుందనేది పెద్ద ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News