విడాకులపై నిహారిక కామెంట్స్‌కు చైతన్య రియాక్షన్

Update: 2024-01-27 01:25 GMT

ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో నిహారిక కొణిదెల తాను విడాకులు తీసుకోవడంపై స్పందిస్తూ..ఆ బాధను తట్టుకోలేక ఎన్నోసార్లు ఏడ్చానని అన్నారు. దీని వీడియో లింక్ సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆమె మాజీ భర్త చైతన్య స్పందించారు. వాస్తవాన్ని తెలుసుకోకుండా ఒక వైపే మాట్లడడం తప్పని.. ఆయా సంఘటనలతో సంబంధం ఉన్న అందరితో మాట్లాడి ప్రజలకు అవగాహన కల్పించాలని వారికి తెలిపారు. ఏకపక్షంగా ఆలోచించి అభిప్రాయాలను వెలిబుచ్చడం సరికాదు. అందుకోసం సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం మానుకోవాలి.

పరోక్షంగా బాధితులను ట్యాగ్ చేయొద్దని చైతన్య సూచించారు. విడాకుల విషయమై ఒకరి వైపు నుంచే మాట్లాడకూడదు. వారి గురించి జోక్యం చేసుకోకూడదు. బాధ నుంచి ఎలా కోలుకున్నామన్నదాని గురించి మాట్లాడితే ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. పూర్తిగా తెలుసుకోకుండా జడ్జ్‌ చేయడం ఎంత తప్పో.. ఇలాంటి ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా ప్రజలకు ఓ కోణంలోనే చెప్పడం అంతే తప్పు అని అనుకుంటున్నా. అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు.మెగా బ్రదర్ నాగేంద్రబాబు కుమార్తె నిహారిక విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఏపీ పోలీసు ఉన్నతాధికారి కుమారుడు జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక వివాహం 2020 డిసెంబరులో జరిగింది. ఏం జరిగిందో తెలియదు కానీ, ఇరువురు కొన్నాళ్లకే విడిపోయారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నామని గతేడాది ప్రకటించారు. 

Tags:    

Similar News