18 ఏళ్ల కిందట వచ్చిన చంద్రముఖి సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఆకట్టుకునే స్టోరీ, అదిరిపోయే యాక్టింగ్.. ముఖ్యంగా రజనీకాంత్, జ్యోతికల పెర్ఫామన్స్ సినిమాను ఓ రేంజ్ లో నిలబెట్టాయి. అప్పట్లో ఇక్కడి స్టార్ హీరోలే పాతిక కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టడానికి తెగ కష్టపడుతుంటే.. రజనీ మాత్రం సునాయసంగా పాతిక కోట్ల మార్క్‌ను టచ్ చేశాడు. పి. వాస్ మేకింగ్, విజన్‌తో హార్రర్ సినిమాలకు ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు. ఆ సినిమాకు సీక్వెల్ అంటూ తెలుగులో హీరో వెంకటేశ్ నటించిన నాగవల్లి, కన్నడలో విష్ణువర్దన్ నటించిన ఆప్తరక్షక అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.
మళ్లీ ఇన్నాళ్లకు లారెన్స్‌ను హీరోగా పెట్టి పి.వాసు ఈ సినిమా సీక్వెల్‌ను రూపొందించాడు. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేసింది. వడివేలు, రాధిక ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్యాచ్ వర్క్ పూర్తి చేసుకుంటుంది. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఫస్ట్ లుక్ చూసిన సినీ అభిమానులంతా కంగారు పడుతున్నారు. సీక్వెల్ కు ఫస్ట్ లుక్ లా లేదని ఏదో చంద్రముఖి కు స్పూఫ్ తీస్తున్నట్లు ఉందని అంటున్నారు. రజనీలా లారెన్స్ నడిచి రావటాన్ని ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంకా కొందరైతే లారెన్స్ లో వెట్టియన్ రాజు కన్నా కాంచన స్టైల్ కనిపిస్తుందని అంటుండగా.. మరికొందరు ట్రాన్స్ ఉమెన్ లా ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవ్లలో వినాయక చివితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కంగానా రనౌత్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో రాధికా శరత్‌కుమర్, వడివేలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచాయి. నిజానికి చంద్రముఖి విజయం తర్వాత రజినీతోనే సీక్వెల్‌ను పట్టాలెక్కించాలని దర్శకుడు p.వాసు ఎంతో ప్రయత్నించాడు. కానీ అది కుదరలేదు.