Chandramukhi-2 Twitte Review : నిజంగా భయపెట్టిందా..? చంద్రముఖి-2 ట్విట్టర్ రివ్యూ..
2005లో రజనీకాంత్, జ్యోతిక కాంబినేషన్ లో వచ్చిన సినిమా చంద్రముఖి. అప్పట్లో ఈ హారర్ కామెడీ సినిమా సెన్సేషనల్ హిట్ కొట్టింది. (Chandramukhi-2 Twitte Review )దాదాపు 17 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించారు. పి.వాసు డైరెక్షన్ లో రాఘవ లారెన్స్, కంగన రనౌత్ కాంబినేషన్ లో వచ్చిన చంద్రముఖి-2.. ఇవాళ (సెప్టెంబర్ 28) థియేటర్లలో రిలీజ్ అయింది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ట్రైలర్ లో కొన్ని సీన్స్ అద్భుతంగా అనిపించాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షోస్ రిలీజ్ అయ్యాయి. సినిమా చూసిన ఆడియన్స్.. ట్విట్టర్ రివ్యూలు ఇస్తున్నారు. రాఘవ లారెన్స్ మెప్పించాడా..? చంద్రముఖిగా కంగనా రనౌత్ భయపెట్టిందా?
పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అయిన చంద్రముఖి-2కు కంగనా వల్ల హిందీలో కొన్ని ఎక్కువ థియేటర్లు దక్కాయి. ఇక పలువురు ఇచ్చిన ట్విట్టర్ రివ్యూల ప్రకారం.. ‘సినిమా స్క్రీన్ ప్లే, సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమా మొత్తం ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. మైండ్ బ్లోయింగ్ స్టోరీ..’అంటున్నారు. ఇక హారర్ విషయానికొస్తే.. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ముందే దీని గురించి చెప్పేశాడు. ‘సినిమా వల్ల దాదాపు రెండు నెలలు నిద్ర పోలేకపోయా. అంతలా ఈ సినిమా నన్ను భయపెట్టింది. కథ చాలా బాగుంది. యాక్టర్లు మెప్పించారు’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా నిజంగానే హిట్ కొట్టిందా.. ఇవాళే రిలీజ్ అయిన రామ్ పోతినేని స్కంద సినిమాకు పోటీ ఇస్తుందా చూడాలి.