Chari 111 : ఒక గూఢచారి, ఒక జేమ్స్బాండ్ కలిపితే ‘చారి 111’.. హిలేరియస్గా వెన్నెల కిషోర్ సినిమా

Byline :  Bharath
Update: 2024-02-12 10:30 GMT

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న స్టార్ కమెడియన్ లో ఒకడు వెన్నెల కిషోర్. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే వెన్నెల కిషోర్.. ఇప్పుడు హీరో అవతారమెత్తాడు. అది కూడా ఆశామాషీ సినిమా కాదు. ఓ గూఢచారి, జేమ్స్ బాండ్ లాంటి స్పై జానర్ ఫిల్మ్ అది. అయితే యాక్షన్ లాంటివి ఈ సినిమాలో ఉన్నా.. వెన్నెల కిషోర్ కామెడీని మాత్రం ఏం మిస్ కారని చిత్ర బృదం చెప్తుంది. డైరెక్టర్ టీబీ కీర్తికుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు చారి 111 అని పేరు పెట్టారు. తమిళ ముద్దుగుమ్మ సంయుక్త విశ్శనాథన్ ఇందులో హీరోయిన్. మార్చి 1న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలుపెట్టారు. కాగా ఈ సందర్భంగా ట్రైలర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.

1992లో ఇండియా- పాకిస్థాన్ క‌లిసి ఓ జాయింట్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇక‌పై రెండు దేశాల్లో ఎలాంటి అణువాయుధాలు గానీ బయోలాజికల్ ఆయుధాలు గీనీ త‌యారు చేయొద్దనే సంభాషణతో ట్రైల‌ర్ మొద‌ల‌వుతుంది. టెర్రరిస్టులకు సంబంధించిన ఓ సీక్రెట్ గ్రూప్ కోవర్ట్ ఏజెన్సీ స్టార్ట్ చేయాలని చూస్తుంది. ఆ గ్రూప్ స్టార్ట్ అయితే దేశానికి ప్రమాదం. దీన్ని కనిపెట్టే సీక్రెట్ స్పైగా ఏజెంట్ వెన్నెల కిషోర్ రంగంలోకి దిగుతాడు. సీనియర్ నటుడు మురళి శర్మ ఈ సినిమాలో స్పై ఏజెన్సీ హెడ్​గా కనిపించనున్నారు. ట్రైల‌ర్ మొత్తం ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సాగింది. ఈ సినిమాను బర్కత్‌ స్టూడియెస్‌ బ్యానర్‌పై అదితి సోని నిర్మిస్తుంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 

Full View

Tags:    

Similar News