Biggboss: బిగ్బాస్ చరిత్రలో తొలిసారి.. కంటెస్టెంట్గా కుక్క

By :  Bharath
Update: 2023-09-24 10:25 GMT

బుల్లి తెర ఆడియన్స్ కు బిగ్ బాస్ షో ఒక ఎమోషన్. ఎన్ని పనులున్నా పక్కనపెట్టి షో చూస్తుంటారు. ఒక్క తెలుగులోనే కాదు దేశంలోని చాలా భాషల్లో బిగ్ బాస్ షో నిర్వహిస్తున్నారు. తెలుగులో ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. తాజాగా సీజన్ 7 లోకి అడుగుపెట్టింది. మలయాళంలో ఆరో సీజన్ మొదలవబోతుంది. తమిళ్ లో త్వరలోనే ఏడో సీజన్, కన్నడలో పదో సీజన్ స్టార్ట్ అవుతున్నాయి. ప్రతీసారిలాగే ఆడియన్స్ కు ఎవరు వస్తారు? ఎంతమంది వస్తారు? అనే ఆతృత ఉంటుంది. అయితే కన్నడ ప్రేక్షకులకు మాత్రం ఎన్నడూ లేనంత ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే హౌస్ లోకి వెళ్లే మొదటి కంటెస్టెంట్ ఎవరనేది ముందే రివీల్ చేశారు.

777 చార్లీ సినిమాలో నటించిన కుక్క బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. చార్లీ సినిమాలో ఎంతగా ఏడిపించిందో అందరికీ తెలిసిందే. సినిమాతో ఆ కుక్కకు చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు. తన చేష్టలతో అలరించిన చార్లీ.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వస్తుందని తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. బిగ్ బాస్ చరిత్రలో ఓ కంటెస్టెంట్ గా జంతువు రావడం ఇదే తొలిసారి. అలాంటిది చార్లీనే వస్తుండటంతో అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ మొదలయింది. మరికొందరు టీఆర్పీ పెంచుకోవడానికి ఈ ప్లాన్ వేసినట్లు చెప్తున్నారు. అయితే చార్లీ కంటెస్టెంట్ గా హస్ లో ఉంటుందా? గెస్ట్ గా వెళ్లి వస్తుందా చూడాలి.

Tags:    

Similar News