అలా చేసినందుకు.. చిరంజీవి కోపడ్డాడు.. ఆయన ఫ్యాన్స్ కొట్టారు: కోట శ్రీనివాసరావు
కామెడీ, విలనిజం రెండు వేరువేరే. కానీ, అవసరమయితే.. సెట్ లో ఒకేసారి రెండింటినీ పండించగల సమర్థుడు కోట శ్రీనివాసరావు. ఆయన సినీ కెరీర్ లో వైవిధ్యమైన పాత్రలు ఎన్నో పోషించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన.. విలక్షణ నటుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతుండగా.. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. జీవిత ప్రయాణాన్ని పంచుకున్నాడు.
‘కెరీర్ లో నాపై ఎన్నో రూమర్స్ వచ్చాయి. షూటింగ్ కు తాగి వెళ్తానని, ఎవరో అమ్మాయిని ఏడింపించానని, డైరెక్టర్లు తిట్టేవాళ్లని, నేను చేసే తప్పులకు కొట్టేవాళ్లని, పెద్ద తాగుబోతునని మాటలు అనేవాళ్లు. నేను తాగనని అనట్లేదు. కానీ, షూటింగ్ విషయంలో జాగ్రత్తగా ఉంటా. ఇది నిజం కాకపోతే.. నాకు ఇన్ని అవకాశాలు వచ్చేవి కాదు కదా. జీవితంలో పెద్దగుమ్మడి కాయంత టాలెంట్ ఉంటే సరిపోదు.. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. అవి రెండూ ఉన్నవాడే కోట. ఒకసారి షూటింగ్ కు తాగి వెళ్తే చిరంజీవి అరిచారు. అంటే నేను కావాలని తాగలేదు. షూటింగ్ వెళ్తే ఆ వేళ నాకు లేదని చెప్పారు. దాంతో ఎమ్మెస్ నారాయణ మందు తాగుదామని బలవంతం చేశాడు.
ఇద్దరం కాస్త తాగం. అంతలోనే డైరెక్టర్ పిలిచి షూటింగ్ ఉందని చెప్పారు. చేసేదేంలేక సెట్స్ కు వెళ్లా. అప్పుడు చిరంజీవి కోపడ్డాడు. ఇంత టాలెంట్ పెట్టుకుని ఇలా చేస్తే.. కెరీర్ దెబ్బ తింటుందని చెప్పాడు. నా మేలు కోరి హెచ్చరించాడు. ఇకపోతే.. మండాలాధీశుడులో ఎన్టీఆర్ పాత్ర చేయమని ఆఫర్ చేశారు. అది చేయాలా వద్దా అని ఆలోచిస్తుంటే.. కృష్ణ వచ్చి చేయమన్నాడు. దానిపై ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారని భయమేసింది. ఆ సినిమా హిట్ అయితే సినిమాలు, లేదంటే ఉద్యోగం అని ఫిక్స్ అయి చేశా. సినిమా సూపర్ హిట్. కానీ చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఓ సారి విజయవాడకు వెళ్తే.. ట్రైన్ దిగగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ నన్ను తిడుతూ, చేయి చేసుకున్నారు. అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయా’ అని చెప్పుకొచ్చారు.