Chiranjeevi - Surekha : భార్యకు బర్త్ డే విషెస్ చెప్పిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవికి ఈ రోజు చాలా స్పెషల్. ఈ రోజు తన భార్య సురేఖ పుట్టినరోజు. ఈ సందర్బంగా తన జీవిత భాగస్వామి సురేఖను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు మెగాస్టార్. ఆ పోస్ట్‌లోని ఫోటో, ఆ కవితను చెప్పిన తీరుకు అంతా ఫిదా అవుతున్నారు. నా జీవన రేఖ.. నా సౌభాగ్య రేఖ.. నా భాగస్వామి సురేఖ.. అంటూ తన భార్యకు ప్రేమతో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం చిరు వేసిన ఈ పోస్ట్ నెట్టింట్లో క్షణాల్లో వైరల్ అవుతోంది.
నా జీవన రేఖ
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 18, 2024
నా సౌభాగ్య రేఖ
నా భాగస్వామి సురేఖ !
Happy Birthday to my lifeline and the greatest pillar of my strength Surekha !
Many Many Happy Returns!💐❤️ pic.twitter.com/JcABQQ1Aey
బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నా.. కానీ షూటింగ్ మధ్యలో ఏ మాత్రం గ్యాప్ దొరికిన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి కేటాయిస్తారు చిరంజీవి . ముఖ్యంగా తన వైఫ్ సురేఖతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంటారు. తన సక్సెస్ ఫుల్ కెరీర్‌లో సురేఖకు ప్రముఖ స్థానం ఉందన్న విషయాన్ని చిరంజీవి చాలా సార్లు చెప్పారు. సినిమా, కుటుంబం విషయంలో సురేఖ తనకు అండగా ఉంటుందని చిరంజీవి చెబుతుంటారు. సమయం దొరికినప్పుడల్లా తన సతీమణిపై ఉన్న ప్రేమను చిరు వ్యక్తపరుస్తుంటారు. తాజాగా సురేఖ పుట్టిన రోజు సందర్భంగా ‘చిరు’ కవిత రాసి శుభాకాంక్షలు చెప్పారు. ‘నా జీవన రేఖ.. నా సౌభాగ్య రేఖ.. నా భాగస్వామి సురేఖ. నా జీవిత రేఖ, నా శక్తికి మూలస్తంభం సురేఖకు జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని చిరంజీవి ఓ కవిత రాశారు. ఈ కవితకు మెగా ఫాన్స్ ఫిదా అవుతున్నారు. చిరంజీవి, సురేఖల వివాహం 1980 ఫిబ్రవరి 20న జరిగింది. దివంగత నటుడు అల్లు అరవింద్ కుమార్తె సురేఖ. వీరిది పెద్దల కుదిర్చిన వివాహం. చిరు-సురేఖలకు ముగ్గురు సంతానం (సుస్మిత, రామ్ చరణ్, శ్రీజ).