మాస్టారూ నిజం చెప్పండి....అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందంటారా అని అడుగుతున్నారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి వెళ్ళిపోవడం....మాట్లాడితే చాలు మహేష్ టూర్ లకు చెక్ చేయడం చూస్తుంటే డౌటొస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. దేని గురించి ఈ డిస్కషన్ అంతా అనుకుంటున్నారా...అదేనండీ త్రివిక్రమ్ డైరక్షన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమా గురించి.
త్రివిక్రమ్ సినిమా అంటేనే తెలుగు ప్రేక్షకులు వెయిట్ చేస్తుంటారు. అందులోనూ మహేష్ తో సినిమా అంటూ ఇంకా ఎక్కువ వెయిట్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూవీ గుంటూరు కారం. హారిక అండ్ హాసిని బ్యానర్ మీద వస్తున్న ఈ సినిమాకు మొదటి నుంచీ ఆటంకాలే ఎదురవుతున్నాయి. కంటిన్యూగా షూటింగ్ అయింది లేదు ఎప్పుడూ. ఒకదాని తర్వా ఒకటి ఈ సినిమాకు కారణాలు అడ్డు వస్తూనే ఉన్నాయి. మధ్యలో ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసి ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపారు కానీ ీ ప్రాజెక్టు నుంచి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోవడం అనుమానాలకు తావిస్తోంది.
మొదట గుంటూరు కారం మూవీ నుంచ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అవుట్ అయ్యాడు. తరువాత హీరోయిన్ పూజా హెగ్డే తప్పుకుంది. సరేలే ఇక్కడితో ఆగిపోతుంది. అంతా బాగానే జరుగుతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు టీమ్ నుంచి మరో ఇద్దరు వెళ్ళిపోయారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు చేసిన సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ వెళ్ళిపోయాడుట. ఆయన ప్లేస్ లోకి కె. రవిచంద్రన్ వచ్చిందని చెబుతున్నారు. మరోవైపు మళ్ళీ మహేష్ బాబు వెకేషన్ కు వెళ్ళిపోయారు. ఒక సినిమా షూటింగ్ అవుతుండగా ఇలా మూడుసార్లు మహేష్ వెకేషన్ కు వెళ్ళడం ఇదే మొదటిసారి. దీంతో అసలు ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందా అని తెలుగు ప్రేక్షకులు డౌట్లు లేవదీస్తున్నారు. దీని మీద త్రివిక్రమ్ కానీ, మూవీ టీమ్ లో ఇంకెవరైనా స్పందిస్తారా లేదా అన్నది చూడాలి.