పవన్ కల్యాణ్ దైవాంశ సంభూతుడు..ఆయన్ని గెలిపించాలి: బ్రహ్మానందం
టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం పవర్ స్టార్ పవన్ కల్యాన్‌ను ఉద్దేశించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగిన బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కల్యాణ్‌ను పొగడ్తలతో ముంచేశారు బ్రహ్మి. పవన్ అంటే తనకు చాలా ఇష్టమని మంచి మనసున్న మారాజు అని బ్రహ్మానందం కామెంట్ చేశారు. అంతే కాదు కావాలనుకునేవారికి ఇష్టమైన అవతార్‌లో కనిపించే దైవాంశ సంభూతుడని పవన్ అని తెలిపారు. ఆయన్ను తప్పక గెలిపించాలని కోరారు.
బ్రో సినిమాతో మరోసారి వెండితెరను షేక్ చేసేందుకు రెడీ అయ్యారు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్. మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించిన ఈ సినిమా జులై 28న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. సముద్ర ఖని డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో అందాల ముద్దుగుమ్మలు కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్‌లు హీరోయిన్లుగా నటించారు. టాలీవుడ్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం మూవీలో కీలక పాత్రను పోషించారు. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో బ్రో ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన బ్రహ్మానందం పవన్ కల్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బ్రహ్మానందం ఈవెంట్లో మాట్లాడుతూ.." బ్రో సినిమాలో పవన్ కల్యాణ్‌తో కలిసి ఒక చిన్న పాత్ర చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరందరూ ఇలా చప్పట్లు కొట్డం కాదు..అందరి ఆశీస్సులు ఆయనపై ఉండాలి. ఆయన విజయం సాధించేలా మనం తోడుండాలి. పవన్‌ను గత 20 ఏళ్ల వయస్సు నుంచి చూస్తున్నాను. పత్తికాయ పగిలి.. బయటికి పత్తి వచ్చినప్పుడు అది ఎంత తెలుపుగా ఉంటుందో.. పవన్‌లో అంతటి అందం ఉంటుంది. మనిషంతా మంచి తనమే. కావాలనుకునేవారికి కావాల్సిన విధంగా కనిపించగల దైవాంశ సంభూతుడు పవన్ కల్యాణ్. తన గురించి మాట్లాడగలిగే అతి తక్కువ వ్యక్తుల్లో నేను ఒకడిని. బ్రో సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్ కావాలని కోరుకుంటున్నా"అని బ్రహ్మీ తెలిపారు.