నాని వర్సెస్ నితిన్.. విన్నర్ ఎవరు..?

Byline :  Babu Rao
Update: 2023-12-02 10:51 GMT

యానిమల్ యానిమల్.. అంటూ డిసెంబర్ ఫస్ట్ న దేశమంతటా ఉన్న క్రేజ్ తో ఈ మూవీ బిగ్గెస్ట్ ఓపెనర్స్ లో రెండో స్థానంలో నిలిచింది. తెలుగు వరకూ చూసుకుంటే ఇది డబ్బింగ్ సినిమానే. అయినా తెలుగులోనూ పైసా వసూల్ అనిపించుకునే అవకాశాలున్నాయి. ఇక ఈ మూవీ తర్వాత వారంపై అందరి దృష్టీ పడబోతోంది. అంటే డిసెంబర్ 7న అన్నమాట. డిసెంబర్ 8న రావాల్సిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలు వాయిదా పడ్డాయి. డిసెంబర్ మూడో వారంలో రావాల్సిన నాని హాయ్ నాన్న, నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. సో పోటీ నాని వర్సెస్ నితిన్ గా మారిందన్నమాట. మరి ఈ ఇద్దరిలో విజయావకాశాలు ఎవరికి ఎలా ఉన్నాయనేది చూద్దాం..

హాయ్ నాన్న మొదట డిసెంబర్ 21న విడుదల చేయాలనుకున్నారు. నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ డిసెంబర్ 23న విడుదల అన్నారు. బట్ 22న డైనోసార్ లాంటి సలార్ వస్తుండటంతో వీళ్లిద్దరూ డిసెంబర్ 7కి ప్రీ పోన్ చేసుకున్నారు. రెండు సినిమాల ట్రైలర్స్ విడుదలయ్యాయి. రెండూ డిఫరెంట్ కంటెంట్స్ తో వస్తున్నట్టు తేలిపోయింది. నాని, మృణాల్ ఠాకూర్, శ్రుతి హాసన్ బేబీ కియారా ప్రధాన పాత్రల్లో నటించిన హాయ్ నాన్నా పూర్తిగా ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కథలా కనిపిస్తోంది. ఇందులో మంచి ప్రేమకథ కూడా ఉంటుందని నాని చెబుతున్నాడు. ఇప్పటికైతే సినిమాకు ఊహించినంత బజ్ క్రియేట్ కాలేదు. రీసెంట్ గా వచ్చిన పార్టీ సాంగ్ ఫర్వాలేదనిపించుకుంది. రిలీజ్ డేట్ దగ్గరగా ఉండటంతో ప్రమోషన్స్ లో వేగం పెంచారు. బట్ అందుకు తగ్గ మైలేజ్ రావడం లేదనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది. అయినా నాని మూవీస్ కు ఎలాగూ మంచి ఓపెనింగ్స్ ఉంటాయి కాబట్టి.. మంచి కంటెంట్ ఉంటే మౌత్ టాక్ తో పికప్ అవుతుంది. బట్ ఏ మాత్రం తేడా వచ్చినా.. మొత్తానికే నష్టం వచ్చినా ఆశ్చర్యం లేదు..

ఇక నితిన్ కొన్నాళ్లుగా వరుస డిజాస్టర్స్ చూస్తున్నాడు. దీంతో ఈ సారి ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ గా కంప్లీట్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు. లేటెస్ట్ లేడీ లక్ శ్రీ లీల హీరోయిన్ గా నటించడం ప్లస్ పాయింట్. ట్రైలర్ హిలేరియస్ గా ఉంది. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. యాక్షన్ కామెడీ మిక్స్ అయినట్టుగా ఉన్న ఈ మూవీకీ పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. ప్రమోషన్స్ కూడా ఏమంత అగ్రెసివ్ గా లేవు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఎవరైనా పెద్ద స్టార్ వస్తే కొంత ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నితిన్ కు ఇప్పటికే ఓపెనింగ్స్ తగ్గాయి. ఈ మూవీతో ఖచ్చితంగా హిట్ కొట్టాలి. ఈ మూవీకి మరో సమస్య ఏంటంటే.. దర్శకుడు వక్కంతం వంశీ. రచయిత నుంచి డైరెక్టర్ అయిన వంశీ ఫస్ట్ మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా పోయింది. ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ దర్శకుడుగా రెండోది.ఈ మూవీతో అతనూ, నితిన్ ఖచ్చితంగా హిట్ కొట్టాలి.

నాని, నితిన్ మధ్య పోటీ స్ట్రాంగ్ గానే ఉంటుందని చెప్పాలి. రెండూ కంటెంట్ ఉన్న సినిమాల్లానే కనిపిస్తున్నాయి. కానీ ఎవరి కంటెంట్ కు ఎంత ఎక్కువ కలెక్షన్స్ వస్తాయనేది డిసెంబర్ 7న తేలిపోతుంది. బట్ ఇప్పటికైతే రెండు సినిమాలపైనా క్రేజ్ కానీ, బజ్ కానీ లేదు అనేది నిజం.   

Tags:    

Similar News