Hari Hara Veera Malluపవన్ కల్యాణ్ కొత్త మూవీ నుంచి క్రేజీ అప్డేట్

Byline :  Krishna
Update: 2024-02-12 15:15 GMT

హరిహర వీర మల్లు.. పవన్ కల్యాణ్ నటిస్తోన్న కొత్త మూవీ. మూడేళ్ల క్రితం ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ మూవీ ప్రారంభించన తర్వాత పవన్ సైన్ చేసిన సినిమాలు రిలీజ్ అయిన ఈ మూవీ మాత్రం విడుదలకు నోచుకోలేదు. తెలంగాణకు చెందిన పండుగ సాయన్న అనే వీరుడి జీవిత కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. దాదాపు 60 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. తాజా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు.

హరిహర వీరమల్లు మూవీ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని నిర్మాణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ వర్క్ నడుస్తున్నట్లు చెప్పింది. త్వరలోనే అదిరిపోయే స్పెషల్ ప్రోమోతో ప్రేక్షకుల ముందుకు వస్తామని ప్రకటించింది. ఆ ప్రోమో ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని ట్వీట్ చేసింది. ఈ సినిమాకు సంబంధించి ఏడాది తర్వాత సడెన్ అప్ డేట్ ఇవ్వడంతో పవన్ ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. అయితే ఈ మూవీ డైరెక్టర్ బాధ్యతల నుంచి క్రిష్ తప్పుకున్నారంటూ వార్తలొచ్చాయి.

ఈ విషయంపై మూవీ యూనిట్ గానీ, క్రిష్ గానీ ఇప్పటివరకు స్పందించలేదు. ప్రస్తుత ట్వీట్ లోనూ ఈ అంశంపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ ట్వీట్ను క్రిష్కు ట్యాగ్ చేయడంతో సినిమా నుంచి ఆయన తప్పుకోలేదని తెలుస్తోంది. చాలాకాలంగా ఈ సినిమాపైనే ఉండడంతో వేరే సినిమాలు చేయలేకపోతున్నారని.. అందుకే హరిహర వీర మల్లు నుంచి క్రిష్ తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇక ఈ సినిమాను ఎం రత్నం నిర్మిస్తుండగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.

Tags:    

Similar News