హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటిస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమాకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చేంది. ఈ సినిమా పొలిటికల్ టీజర్‌ను ఈ నెల 19న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కెరీర్‌లోనే బిగ్గేస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ఇది. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సెట్స్‌పైకి వచ్చిన కొత్తలో షూటింగ్‌ను ఫాస్ట్ ఫాస్ట్‌గా జరుపుకుంటూ ఫస్ట్ గ్లింప్స్ వదిలాడు డైరెక్టర్ శంకర్.
కానీ వపన్ రాజకీయాల వల్ల ఈ మూవీకి వరుస బ్రేక్‌లు పడుతుండటంతో అప్‌డేట్స్ ఏవీ రావడం లేదు. దాంతో ఒకానోక టైంలో మూవీ షూటింగ్ ఆగిపోయిందనే రూమర్స్ కూడా వచ్చాయి. పవన్ కళ్యాణ్ ఎన్నికలతో బిజీగా ఉన్న తరుణంలో ఆయన లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫ్యాన్స్‌కి బూస్ట్ ఇచ్చే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. త్వరలోనే 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి క్రేజీ అప్‌డేట్ రానుందంటూ అందరిని సర్‌ప్రైజ్ చేశారు. ఈ మేరకు మైత్రీ మూవీ మేకర్స్ తమ ఎక్స్‌లో పోస్ట్ వదిలారు. ఇది చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఎక్ప్‌పెక్ట్ ది అన్‌ఎక్స్‌పెక్ట్ అంటూ క్యూరిసిటీ పెంచారు. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఊహించని అప్‌డేట్ రాబోతుందంటూ మేకర్స్ హైప్ పెంచారు. ఇది చూసి అభిమానులు అంతా అంచనాలు వేసుకుంటున్నారు