SS Rajamouli : రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్.. ఐదుగురు బడా స్టార్స్తో బిగ్ డీల్..?

Update: 2023-08-28 07:34 GMT

తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్ రాజమౌళి. బాహుబలి, ఆర్ఆర్ఆర్తో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇక జాతీయ స్థాయిలో ఏకంగా ఆరు అవార్డులను కొల్లగొట్టింది. జక్కన్న తనకు కావాల్సిన అవుట్ పుట్ వచ్చేవరకు ఆయన సినిమాను చెక్కుతూనే ఉంటారు. అది ఎన్నేళ్లైనా సరే. సినిమా షూటింగ్ కంటే ప్రీ ప్రొడక్షన్ పైనే ఆయన ఎక్కువ ఫోకస్ పెడతారు. కథపై బాగా కసరత్తు చేసిన తర్వాత రంగంలోకి దిగుతారు.

మహేష్ తో అడ్వెంచరస్ మూవీ..

ఆర్ఆర్ఆర్ తర్వాత జక్కన్న మహేష్ బాబుతో మూవీ చేస్తున్నారు. పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గకుండా సినిమా తీసేందుకు రాజమౌళి కసరత్తు చేస్తున్నారు. ప్రస్తతం ఆయన కథపై ఫోకస్ పెట్టారు. తన తండ్రి విజయేంద్రప్రసాద్ సిద్ధం చేసిన కథకు తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ మూవీగా ఈ మూవీని తెరకెక్కించనున్నారు.ఈ మూవీ తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతంపై ఆయన దృష్టి పెడతారు.

బడా స్టార్స్తో ..

మహాభారతాన్ని సినిమాగా తీసుకరావాలని రాజమౌళి ఎప్పటినుంచో అనుకుంటున్నారు. ఒకవేళ మహాభారతం ప్రాజెక్ట్ చేస్తే 10భాగాలుగా తెరకెక్కిస్తానని అప్పట్లోనే ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టుకు జక్కన్న ఎవరినీ ఎంచుకుంటారనేది ఆసక్తిగా మారింది. తాజాగా దీనిపై సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. తెలుగు స్టార్ హీరోలను ఈ సినిమాలో భాగం చేసేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నారట. వారికి సంబంధించిన క్యారెక్టర్స్ కూడా డిసైడ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

బన్నీ ఫ్యాన్స్ హర్ట్..

ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ లతో రాజమౌళి మహాభారతం తీయాలని అనుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రభాస్ కర్ణుడు, మహేష్ బాబు కృష్ణుడు, రామ్ చరణ్ అర్జునుడు, ఎన్టీఆర్ భీముడు పాత్రలకు సెట్ అవుతారని భావిస్తున్నారట. ఇందులో అల్లు అర్జున్ మిస్ అవ్వడంతో ఆయన ఫ్యాన్స్ హర్ట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఇంకా చాలా పాత్రలు ఉన్నాయని.. అందులో బన్నీకి ఛాయిస్ ఉంటుందని జక్కన్న అభిమానులు చెబుతున్నారట. ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే ఇండియన్ ఇండస్ట్రీ షేక్ అవ్వడం ఖాయం. ఐదుగురు స్టార్లు నటిస్తే అటు ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటారు.



Tags:    

Similar News