బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్.. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ వీడియోలో రణ్‌వీర్ తోపాటు మెగా పవర్ స్టార్ రాంచరణ్, బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనె, చెన్నై భామ త్రిష కూడా ఉండడం విశేషం. ఈ క్రేజీ కాంబినేషన్ ఏంటి అనే సందేహాలు అందరిలో ఉన్నాయి. షో మీ ది సీక్రెట్ అనే హ్యాష్ ట్యాగ్ జోడిస్తూ.. త్వరలో బిగ్ రివీల్ ఉండబోతోంది అని ఉత్కంఠ పెంచారు. ఇక ఈ వీడియో విషయానికి వస్తే.. దీపికా పదుకొనె తన భర్త కనిపించడం లేదు అంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తుంది. ఇంతలో రణ్‌వీర్ సింగ్.. సార్ టార్గెట్ కనిపించింది అంటూ బయలుదేరుతాడు.. వెంటనే ఏజెంట్ గో గో అంటూ రాంచరణ్ కి ఆర్డర్స్ వస్తాయి. దీనితో చరణ్ ఎవరినో ఛేజ్ చేస్తూ వేగంగా పరిగెత్తడం చూడొచ్చు. ఇక చివర్లో త్రిష.. పోలీస్ స్టేషన్ లో నిస్సహాయంగా చూస్తూ ఉంటుంది.
కొన్ని రహస్యాలు ఎప్పటికి రహస్యాలుగానే ఉండిపోతాయి. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతక్కుండా వదిలేస్తేనే బెటర్.. కొన్ని మిస్టరీలను కనుక్కోకుండా వదిలేస్తేనే బెటర్ అంటూ రాసుకొచ్చారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ప్రోమో.. సినిమానా..? లేక యాడ్ నా ..? అనేది తెలియాలంటే జూలై 5 వరకు ఆగాల్సిందే. ఎందుకంటే ఆ రోజే ఆ ప్రోమోను సంబంధించిన డీటైల్స్ చెప్పనున్నట్లు మేకర్స్ తెలిపారు. దీంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగి పోయింది. అసలు ఏంటి ఈ ప్రోమో అని తలలు పట్టుకుంటున్నారు. నిజంగానే ఇది వెబ్ సిరీస్ అయితే మాత్రం బాలీవుడ్ లో చరణ్ రేంజ్ ఓ రేంజ్ లో మరోసారి పెరిగిపోతుంది. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.