'అది నా పిల్ల'.. దేవరకొండ బ్రదర్స్ పోస్ట్ వైరల్

Update: 2023-08-27 07:35 GMT

విజయ్ దేవరకొండ ,సమంత జోడీగా నటించిన యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఖుషి’ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. శివ నిర్వాణ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ సినీ ప్రియులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ప్రస్తుతం మూవీ యూనిట్ చిత్ర ప్రమోషన్లతో బిజీ బిజీ ఉంటోంది. సమంత అమెరికాలో ఖుషీగా ఖుషీ సినిమా ప్రమోషన్స్ చేస్తోంది. ఇటు విజయ్ దేవరకొండ లోకల్‎గా సినిమాకు హైప్‎ను తీసుకువస్తున్నాడు.సోషల్ మీడియాలోనూ తనదైన స్టైల్‎లో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా విజయ్ ఖుషిలోని తన డైలాగ్‎ను ఉద్దేశిస్తూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్‎కు తమ్ముడు ఆనంద్ రిప్లై ఇచ్చాడు. దీంతో దేవరకొండ బ్రదర్స్ నెట్టింట్లో సందడి చేశారు. ఇంతకీ ఈ బ్రదర్స్ ఇద్దరూ ప్రత్యేకంగా నెట్టింట్లో ఏ సీన్స్ గురించి మాట్లాడుకున్నారంటే...

విజయ్‌ ప్రస్తుతం 'ఖుషి' ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఈ మూవీపైన నెటిజన్లు సరదాగా మీమ్స్, ఇంట్రెస్టింగ్ వీడియోలను క్రియేట్‌ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా అదే వేదికపైన విజయ్ ఈ మీమ్స్‎కు తనదైన స్టైల్‎లో స్పందించాడు. ఓ నెటిజన్‌ 'ఖుషి'లో విజయ్‌ చెప్పే 'అది నా పిల్ల' డైలాగ్‌ను. 'బేబీ' లోని ఓ సన్నివేశంలో 'అది నా పిల్లరా' అంటూ ఆనంద్‌ ఎమోషనల్‎గా ఫీల్ అయ్యే సీన్‌ను యాడ్‌ చేశాడు. "ఆకలేసిన వాడు ఒకరకంగా అంటాడు.. ఎదురుదెబ్బ తగిలినవాడు ఒకరకంగా అంటాడు" అని 'కింగ్‌' సినిమాలో కామెడీ స్టార్ బ్రహ్మానందం చెప్పే ఫన్నీ డైలాగ్‌‎ను ఈ సీన్స్‎లో మిక్స్‌ చేసి సరదా వీడియో చేశాడు. ఈ వీడియోకు విజయ్‌ రిప్లై ఇస్తూ.. "అది నా పిల్ల.. ఇదొక ఎమోషన్‌" అని నవ్వించారు. ఆనంద్‌ స్పందిస్తూ.. "ట్విటర్‌ అప్పుడప్పుడూ ఇలాంటి రత్నాలను బయటికి తీస్తుంది" అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Tags:    

Similar News