Dil Raju : దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీ.. ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీ..!

Byline :  Kiran
Update: 2023-12-30 03:52 GMT

(Dil Raju) టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నికల్లో పోటీకి నిరాకరించిన ఆయన ఈ సారి బరిలో దిగేందుకు సై అంటున్నారని వార్తలు వస్తున్నాయి. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి దిల్ రాజు పోటీ చేయనున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ పార్టీ తరఫున దిల్ రాజు ఎంపీ అభ్యర్థిగా నిజామాబాద్ బరిలో దిగుతారని టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి గత ఎన్నికల్లోనే ఆయనను పోటీలో నిలపాలని కాంగ్రెస్ భావించింది. అయితే అప్పట్లో ఆయన నిరాకరించినట్లు తెలుస్తోంది. తాజాగా దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమయ్యారని సమాచారం. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆయనకు నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వాలని డిసైడైనట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఇదిలా ఉంటే నిజామాబాద్ ఎంపీ టికెట్‌ను పార్టీ సీనియర్ నేతలైన షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆశిస్తున్నారు. షబ్బీర్ అలీ ఇటీవల నిజామాబాద్ అర్బన్ నుంచి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా దిల్ రాజు పేరు తెరపైకి రావడంతో నిజామాబాద్ టికెట్ ఎవరికి దక్కనుందన్న దానిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముంది. 




Tags:    

Similar News