Anudeep K.V. : ‘ఇదే నా చివరి సినిమా’.. డైరెక్టర్ అనుదీప్ కీలక నిర్ణయం

Byline :  Bharath
Update: 2023-10-05 12:52 GMT

జాతిరత్నాలు సినిమా హిట్ తో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు డైరెక్టర్ అనుదీప్ కేవీ. అతని కామెడీ, టైమింగ్ పంచ్ లకు సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. 2016లో వచ్చిన పిట్టగోడ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన అనుదీప్.. ఐదేళ్ల గ్యాప్ తీసుకుని జాతిరత్నాలుతో హిట్ కొట్టాడు. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో ప్రిన్స్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం యాక్టింగ్ కూడా మొదలుపెట్టిన అనుదీప్.. మ్యాడ్ సినిమాలో నటించాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. అందులో పాల్గొన్న అనుదీప్.. ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.




 


‘మ్యాడ్ సినిమాతో యాక్టర్ గా పరిచయం అవుతున్నారు. మున్ముందు మిమ్మల్ని హీరోగా చూడొచ్చా’ అని యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు అనుదీప్ ఆన్సర్ ఇచ్చాడు. ‘అదేం లేదు. ఇదే నా చివరి సినిమా. ఈ సినిమా డైరెక్టర్ కళ్యాణ్ కోరితేనే ఇందులో యాక్ట్ చేశా. ఇకపై నటనకు దూరంగా ఉంటా’ అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాతో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీ ప్రియారెడ్డి, అనంతిక, గోపికా ఉద్యాన్ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. ఈ కామెడీ ఎంటర్ టైనర్ అక్టోబర్ 6న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.




Tags:    

Similar News