పేపర్లో వార్త చదివి.. విరూపాక్ష కథ రాసుకున్నా : కార్తీక్ దండు

Update: 2023-06-12 11:32 GMT

సాయిధరమ్ తేజ్ నటించిన రీసెంట్ బ్లాక్ బాస్టర్ మూవీ విరూపాక్ష. ఎటువంటి అంచనాలు లేకుండా సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ సినిమా 100కోట్లు కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. కార్తీక్ దండు డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి కార్తీక్ దండు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఓ పేపర్ వచ్చిన వార్త చూసి విరూపాక్ష కథ రాసుకున్నట్లు తెలిపారు.

‘‘ హారర్‌ జోనర్‌లో ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా చేయాలనే ఆశ ఉండేది. 2016 -17 సంవత్సరంలో పేపర్‌లో వచ్చిన ఓ క్రైమ్‌వార్త చదివాను. ఉత్తరాదిలోని ఓ ఊరికి చెందిన మహిళ.. తన భర్త చనిపోవడంతో ఆ ఊరి చివర నివసిస్తుండేది. అయితే, అదే సమయంలో ఊర్లో ఇద్దరు పిల్లలు అనారోగ్య సమస్యలతో చనిపోయారు. గ్రామస్థులందరూ ఆ మహిళను అనుమానించి.. అతి క్రూరంగా చంపేశారు. ఈ వార్త చదివిన తర్వాతే విరూపాక్ష రాయాలనిపించింది’’ అని కార్తీక్ చెప్పారు.

అంతేకాకుండా తాను రాసిన కథలో శ్యామల విలన్‌ అని తెలిపారు. ‘‘ శ్యామల తల్లిదండ్రులు చనిపోయాక.. ఆమె ఆ ఊరు నుంచి పారిపోయి.. తిరిగి అదే గ్రామానికి కోడలిగా వచ్చి.. పగ తీర్చుకుంటుంది. కాకపోతే, సుకుమార్‌ సర్‌.. దాన్ని మార్చి హీరోయిన్‌ను విలన్‌గా చూపించారు. హీరోయిన్‌కు అనుగుణంగా మార్పులు చేయడానికి మాకు ఏడు నెలలు సమయం పట్టింది’’ అని కార్తిక్‌ వివరించారు.

ఈ సినిమాలో సాయి ధరమ్‌ తేజ్‌కు జోడిగా సంయుక్త మీనన్ నటించింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. సుకుమార్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే సమకూర్చడమే కాకుండా నిర్మాణంలో కూడా పాలుపంచుకున్నాడు. కాంతారా ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాగా విరూపాక్ష శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ స్టార్ మా సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సినిమాను రూపొందించారు.


Tags:    

Similar News