ప్రభాస్ కల్కి వాయిదాపై నాగ్ అశ్విన్ క్లారిటీ

Update: 2023-08-07 14:08 GMT

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ పాన్ వరల్డ్ లెవెల్ ప్రాజెక్టుల షూటింగ్లతో ఫుల్ బిజీగా ఉన్నాడు. సలార్, రాజా డీలక్స్ వంటి సినిమాలతో పాటు డార్లింగ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్‎లో ప్రాజెక్ట్ కె అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రారంభమైన మూవీలోనూ నటిస్తున్నాడు. ఈ మధ్యనే ఈ మూవీకి ‘కల్కి 2898 ఏడీ’ అనే పేరు పెట్టారు మేకర్స్. ఈ ప్రాజెక్ట్ నుంచి విడుదలైన పోస్టర్లు , టీజర్లు మూవీపై ఇప్పటికే భారీ అంచనాలను పెంచేశాయి. ప్రభాస్ యాక్టింగ్ వేరే లెవెల్లో ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. ఆదిపురుష్ ఎఫెఎక్ట్ తో ప్రభాస్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఈ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మూవీ పోస్టర్లలో 2024జనవరి 12న రిలీజ్ డేట్ అని ఇచ్చారు మేకర్స్. ఇదే అఫీషియల్ అనౌన్స్‎మెంట్ అని అభిమానులంతా భావించారు. కానీ ‘కల్కి’ విడుదల పోస్ట్‎పోన్ అయ్యిందనే వార్తలు గత కొంత కాలంగా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీని మే 9కి వాయిదా వేశారన్న న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అప్‎సెట్ అయ్యారని తెలుస్తోంది. పెద్ద ఎత్తున మూవీపై నెట్టింట్లో ట్రోలింగ్ జరుగుతోంది. దీంతో దీనిని సీరియస్‎గా తీసుకున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు.




 


పరేషాన్‎లో ప్రభాస్ ఫ్యాన్స్...

కల్కి విడుదల పోస్ట్‌పోన్ అంటూ వస్తున్న న్యూస్ నిజంగా ఫేక్ అయితే నాగ్ అశ్విన్ డైరెక్ట్‎గా నేరుగా అలాంటిదేమి లేదు అని చెప్పవచ్చు. కానీ అలా చేయలేదు. నాగ్ అశ్విన్ ప్రభాస్ ఫ్యాన్స్‌ను అయోమయంలో పడేశారు. ఆయన సోషల్ మీడియా వేదికగా ‘‘జాతకాలు, నక్షత్రాల కూటమిని స్టడీ చేస్తే దీనికి అఫీషియల్ అనౌన్స్‎మెంట్ ఇవ్వచ్చు’’ అన్నాడు నాగ్ అశ్విన్. అయితే నాగ్ అశ్విన్ ఏం చెప్పాడో అర్థం కాక, క్లారిటీ రాక ప్రభాస్ ఫ్యాన్స్ పరేషాన్‎లో పడిపోయారు. జనవరి 12న డార్లింగ్ ప్రభాస్ మూవీ వెండితెరపై వస్తుందా? లేదా మే 9 వరకు వెయిట్ చేయాలా అని ఫ్యాన్స్‌కు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కానీ డైరెక్ట్ర్ తీరు చూస్తుంటే మూవీ రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ అయినట్లు అర్థం అవుతోంది. వాయిదా వార్తలను నాగ్ అశ్విన్ కొట్టేయలేదు కాబట్టి మే 9కే కల్కి వస్తుందని ఫ్యాన్స్ ఫిక్స్

అవుతున్నారు.

అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారా?..

‘కల్కి 2898 ఏడీ’ మూవీ అత్యంత భారీ బడ్జెట్‏తో తెరకెక్కబోతోంది. ఈ మూవీకి అశ్వినీ దత్ ప్రొడ్యూజర్‎గా వ్యవహరిస్తున్నారు. అయితే నిర్మాత జనవరి 12 కన్నా మే 9కే విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. అందుకు ఓ కారణం ఉంది. అశ్వినీ దత్ ప్రొడ్యూజ్ చేసిన చిరంజీవి మూవీ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, కీర్తి సురేష్ నటించిన ‘మహానటి’ లాంటి చిత్రాలు మే 9న విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు బాక్స్‎ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లు సాధించాయి. ఆ సెంటిమెంట్ ను ఫాలో అయితే గనుక ‘కల్కి 2898 ఏడీ’ కూడా అదే రోజు విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే విధంగా మూవీ వీఎఫ్ఎక్స్ కూడా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ అవ్వడానికి ఒక కారణంగా తెలుస్తోంది.




 







 

Tags:    

Similar News