టాలీవుడ్ లో హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసే దర్శకుల్లో నర్రా శివనాగు ఒకరు. చిన్నచిన్న సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. గతంతో తారకరత్నతో దేవినేని చిత్రాన్ని తీసి తన టాలెంట్‌ను టాలీవుడ్‌కు పరిచేయం చేశారు. ఆయన తాజాగా దర్శకత్మవం వహిస్తున్న చిత్రం “నటరత్నాలు”. బుధవారం ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా శివనాగు మాట్లాడుతూ హీరో సుమన్ పై సంచలన ఆరోపణలు చేశాడు. ఫంక్షన్‌కు పిలిస్తే సుమన్ రూ.2 లక్షలు డిమాండ్ చేశారని ఫైర్ అయ్యారు
"ఆడియో ఫంక్షన్‌కు రావడానికి సుమన్ డబ్బులు ఆడగడం చాలా బాధాకరం. ఈ మధ్యకాలంలో చిన్న సినిమా ఫంక్షన్‌లకు ఎవరూ సహకరించట్లేదు. సుమన్‌కు ఫోన్ చేసి ఆడియో ఫంక్షన్‌కు రావాలని కోరా. అసిస్టెంట్‌తో మాట్లాడమని చెప్పారు. పది రోజులు సాగదీసి ఆయన మేకప్‌మెన్ ఫోన్ ఎత్తారు. రెండు లక్షలు ఇస్తే ఫంక్షన్‌కి వస్తారు అని చెప్పారు. సుమన్ తీరు చూశాక బాధ కలిగింది."అని శివనాగు తెలిపారు. .ఈ కార్యక్రమంలో ఎరపతినేని శ్రీనివాసరావు , దివ్యవాణి, డా. పద్మ, చికోటి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.“నటరత్నాలు” లో హీరోయిన్గా, రంగస్థలం మహేష్, సుదర్శన్ రెడ్డి, తాగుబోతు రమేష్ లాంటి కమెడియన్స్ నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డా.దివ్య నిర్మిస్తున్నారు.