సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. వ్యూహం ప్రి రిలీజ్ వేడుకలో దాసరి కిరణ్ తో కలిసి పాల్గొన్న ఆర్జీవీ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. డిసెంబర్ లో తమ మూవీ వ్యూహం రిలీజ్ కావాల్సి ఉండేనని, అయితే లోకేశ్ తన తెలివినంతా ఉపయోగించి వ్యూహం మూవీని విడుదల కాకుండా ఆపారని అన్నారు. అందుకు లోకేశ్ కు తాను థ్యాంక్స్ చెబుతున్నట్లు సెటైర్లు వేశారు. డిసెంబర్ లో తమ మూవీ రిలీజ్ అయ్యుంటే ఈ పాటికి జనాలు మరిచిపోయి ఉండేవారని, కానీ ఇప్పుడు విడుదల కానుండటంతో తమ మూవీ బాగా పాపులర్ అవుతుందని అన్నారు. ఇదంతా లోకేశ్ వల్లేనని ఎద్దేవా చేశారు. గత డిసెంబర్ లో తమ మూవీని రిలీజ్ కాకుండా ఆపి తాను ఇంటెలిజెంట్ అని లోకేశ్ మరోసారి నిరూపించుకున్నాని ఎద్దేవా చేశారు. సరిగ్గా ఎన్నికల సమయంలో తమ మూవీ రిలీజ్ కానుండటం హ్యాపీగా ఉందని ఆర్జీవీ అన్నారు.