శంకర్ .. ఇది మరీ టూ మచ్ గురూ

By :  Babu Rao
Update: 2023-10-26 12:32 GMT

కొందరు దర్శకులు ఉంటారు. వాళ్ల సినిమాలన్నీ బ్లాక్ బస్టర్. కానీ బడ్జెట్ భారీగా ఉంటుంది. ఖచ్చితంగా చెబితే ఆ దర్శకుల సినిమాలు బడ్జెట్ ప్లానింగ్ తో మొదలు కావు. మూవీ పూర్తయ్యాక ఎంత అయిందో లెక్కలు చూసుకుంటే అప్పుడు కానీ నిర్మాతల గుండెలు గుభేల్ మనవు. ఇలాంటి దర్శకులకు లీడర్ లాంటివాడు శంకర్. అతనెప్పుడూ బడ్జెట్ లో సినిమాలు చేయలేదు. ఏ నిర్మాతా ఇంత బడ్జెట్ లోనే సినిమా తీయాలని అతన్ని ఒప్పించనూ లేదు. అందుకే విజువల్ గ్రాండీయర్ పేరుతో అతను వేసిందే సెట్టు.. తీసిందే సాంగు అన్నట్టుగా మారింది. ఇప్పుడు ఒక్క పాట కోసం అతను పెడుతున్న ఖర్చు.. వచ్చే నెలలో విడుదల కాబోతోన్న ఓ క్రేజీ మూవీ బిజినెస్ అంత. మరి ఆ సినిమా ఏంటో తెలుసు కదా..

శంకర్.. ఇండియన్ సినిమాకు ఓ గ్రాండియర్ ను తెచ్చిన దర్శకుడు. అతని సినిమా అంటే కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ అంతే అన్న పేరు చాలాయేళ్లు వినిపించింది. కానీ కొన్నాళ్లుగా గాడి తప్పాడు. అయినా రాజమౌళి కంటే ముందు మన సినిమాకు టెక్నికల్ హంగులు అద్దిన దర్శకుల్లో టాప్ త్రీలో ఉంటాడు. అతనికంటే ముందే మన కోడి రామకృష్ణ ఆ పని చేశాడనుకోండి. ఇప్పటి వరకూ తమిళ్ చిత్రాలకే పరిమితం అయిన శంకర్ ఫస్ట్ టైమ్ తెలుగు సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో రామ్ చరణ్ హీరోగా రూపొందిస్తోన్న ఈ సినిమా గేమ్ ఛేంజర్. ఈ మూవీ మొదలైనప్పుడు రామ్ చరణ్ కెరీర్ ఛేంజర్ అవుతుందనుకున్నారు. బట్ మొదలు కావడం బానే ఉన్నా.. ముందుకు సాగడంలో ఎప్పుడూ వెనకే ఉంది. ఈ మూవీ స్టార్ట్ కాగానే భారతీయుడు2 నిర్మాతలు కేస్ గెలిచి ముందు తమ సినిమా పూర్తి చేయాలని అల్టిమేటమ్ జారీ చేశారు. దీంతో అతను భారతీయుడు2 పూర్తి చేయడంపై ఫోకస్ చేసి గేమ్ ఛేంజర్ ను వదిలేశాడు. ఈ విషయంలో దిల్ రాజు కూడా ఏం చేయలేకపోయాడు. అప్పుడప్పుడూ గెస్ట్ ఆర్టిస్ట్ లాగా గేమ్ ఛేంజర్ షెడ్యూల్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో రీసెంట్ గా అతనో పాట చిత్రీకరించాడట. ఈ పాటకు అయిన ఖర్చు 16 కోట్ల రూపాయలు అంటూ వార్తలు వస్తున్నాయి. ఒక్క పాట కోసం మరీ 16 కోట్లు అంటే ఆ పాట ఎంత గ్రాండ్ గా ఉన్నా.. నిర్మాత ఎప్పుడు చూసుకున్నా.. అందులో ఆర్టిస్టులు కాక.. డబ్బు కట్టలే కనిపిస్తాయనడంలో సందేహం లేదు. ఈ బడ్జెట్ లో మీడియం రేంజ్ హీరోతో ఓ సినిమానే తీయొచ్చు. మినీ మూవీస్ అయితే కనీసం నాలుగు అయినా నిర్మించొచ్చు.. బట్ ఇలాంటి లెక్కలు పెద్ద సినిమాల విషయంలో మాట్లాడకూడదు. అయినా ఖర్చు అనేది కథ కోసం పెట్టాలి.. కానీ ఇలా కేవలం పాటల కోసం పెడితే.. ఒకవేళ ట్యూన్ బాలేకున్నా.. డ్యాన్సులు బాలేకున్నా.. జనం పెద్దగా పట్టించుకోరు కదా.. ఏదేమైనా ఈ సాంగ్ బడ్జెట్ తో ఇప్పుడు గేమ్ ఛేంజర్ మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చింది.

Tags:    

Similar News