నెల క్రితమే నిహారిక-చైతన్య జంటకు విడాకులు మంజూరు

Update: 2023-07-05 03:35 GMT

ప్రముఖ నటుడు నాగబాబు కుమార్తె, నటి నిహారిక కొణిదెల.. మాజీ ఐజీ జొన్నలగడ్డ ప్రభాకరరావు కుమారుడు జె.వి.చైతన్యల వివాహం రద్దయింది. కూకట్‌పల్లిలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఏప్రిల్‌ 1న వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. జూన్‌ 5న విడాకులు మంజూరయ్యాయి. విషయం ఆలస్యంగా బయటకొచ్చింది.




 


నిహారిక- చైతన్య వివాహం 2020 డిసెంబర్ 9వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో గల ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీ మొత్తం ఈ పెళ్లి వేడుకలకు హాజరైంది. బాలీవుడ్‌కు చెందిన కొందరు ప్రముఖులు కూడా ఈ వివాహానికి హాజరై, వధూవరులను ఆశీర్వదించారు. అయితే ఎంతోకాలం ఈ బంధం నిలవలేదు. 4 సంవత్సరాల వ్యవధిలోనే విడాకుల వరకు వెళ్లింది.




 


నిహారిక భర్తతో విడిపోయిందంటూ కొన్నాళ్ల నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. అది నిజమేననుకునేలా వారిద్దరూ తమ తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ల నుంచి పెళ్లి ఫొటోలతో పాటు ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను డిలెట్ చేసుకున్నారు. తమ కుటుంబంలో జరిగే శుభ కార్యాలకు కూడా నిహారిక ఒంటరిగానే హాజరు కావడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఇటీవలే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌కూ నిహారిక ఒంటరిగా హాజరు కావడం కనిపించింది. వీరిద్దరు సపరేట్ అయ్యారని నెటిజన్లు కన్ఫామ్ చేసుకున్నారు కూడా. ఈ లోపే అఫిషియల్ డైవర్స్ మేటర్ నిన్న వైరల్ అయింది. మనస్పర్థలు రావడం వల్లే నిహారిక-చైతన్యలు కలిసి జీవించలేమనే నిర్ణయాన్ని తీసుకున్నారని టాక్.




 


 


Tags:    

Similar News