డీజే టిల్లు 2 రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది..

Update: 2023-07-05 14:25 GMT

తక్కువ బడ్జెట్‌తో వచ్చి భారీ విజయాన్ని అందుకున్న సినిమా `డీజే టిల్లు`. ఈ మూవీలో హీరో సిద్దు జొన్నలగడ్డ తన పెర్ఫార్మెన్స్‎తో ఓ రేంజ్ లో జనాలకు పిచ్చెక్కించేశాడు. తెలంగాణ స్లాంగ్‏లో స్క్రీన్ మీద చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వెండితెరపై నాన్‌ స్టాప్‌ నవ్వులు పూయించి అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ మూవీలోని `టిల్లు` పాత్ర అందరికీ బాగా కనెక్ట్ అయ్యింది. టిల్లు స్టయిల్‌, డైలాగ్స్ చాలా ఫేమస్ అయ్యాయి. డీజే టిల్లుకు వచ్చిన రెస్పాన్స్‎ చూసిన మేకర్స్ ఇప్పుడు ఆ ఫన్‌ని మరింత రెట్టింపు చేసేందుకు టిల్లు స్క్వేర్ అనే సీక్వెల్‌‎తో రెడీ అయ్యారు. సీక్వెల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి `టిల్లు స్వ్కేర్‌` ను బిగ్ స్క్రీన్ లో ఎప్పుడెప్పుడు చూడాలా అని సిద్ధు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ న్యూస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. డీజే టిల్లు 2 అక్టోబర్‏లో విడుదల అవుతుందనే టాక్ బాగా వనిపిస్తోంది.

డీజే టిల్లు పేరు.. వీని స్టయిలే వేరు..’ అంటూ యూత్‌తో పాటు ఫ్యామిలీస్‌ని బాగా ఆకట్టుకున్న సిద్ధు ఇప్పుడు టిల్లు స్క్వేర్ తో మరోసారి స్క్రీన్ మీద మ్యాజిక్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఇప్పుడు ఈ చిత్రం సీక్వెల్‌‎ను నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మల్లిక్‌ రామ్‌ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రంలో సిద్ది మెయిన్ రోల్ పోషిస్తుండగా అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ మధ్యనే విడుదలైన సినిమా పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఈసారి రెట్టింపు వినోదం గ్యారంటీ అంటూ.. మేకర్స్ హామీ కూడా ఇస్తున్నారు. ప్రేక్షకుల వెయిటింగ్‎కు తెర దించేందుకు అక్టోబర్ 6న సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. అందుకు సంబంధించిన సన్నాహాలు చేస్తోందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే రిలీజ్ డేట్‎కు సంబంధించి చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్‎డేట్ రాలేదు.





Tags:    

Similar News