త్వరలోనే డీజే టిల్లు క్యూబ్ అప్డేట్

Byline :  Babu Rao
Update: 2024-03-29 11:49 GMT

ఒక సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్స్ అనడం కామన్. చాలామంది తీయరు. బట్ డిజే టిల్లుకు సీక్వెల్ గా డిజే టిల్లు స్క్వేర్ అని వచ్చింది. ఈ శుక్రవారం విడుదలైన ఈ మూవీకి కూడా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సిద్ధు సింగిల్ హ్యాండెడ్ గా లాగించేశాడు. అంతా తానే అయి సినిమాని బ్లాక్ బస్టర్ వరకూ తెచ్చాడు.

డిజే టిల్లు ఫస్ట్ పార్ట్ కు విమల్ కృష్ణ దర్శకుడు. ఈ పార్ట్ కు మాలిక్ రామ్ డైరెక్టర్. ఈ డిజే టిల్లు స్క్వేర్ లో కూడా హీరోయిన్ మనోడికి హ్యాండ్ ఇచ్చింది. అందువల్ల మరో పార్ట్ కు ఛాన్స్ ఉంది. అందుకే దీన్నో ఫ్రాంచైజీ లాగా రూపొందించాలనుకుంటున్నారట. ఈ మేరకు సిద్ధు కూడా సక్సెస్ మీట్ లో ఓ మాట చెప్పాడు. నెక్ట్స్ సీక్వెల్ కు డిజే టిల్లు క్యూబ్ అనే టైటిల్ పెట్టబోతున్నారు అని కూడా అంటున్నారు.

ఏదేమైనా డిజే టిల్లు ఫ్రాంచైజీ ఖచ్చితంగా వర్కవుట్ అవుతుంది. ఆ మేరకు ఆలోచిస్తున్నారట. త్వరలోనే డిజే టిల్లు క్యూబ్ కు సంబంధించిన అప్డేట్ ఇస్తాం అని నిర్మాత నాగవంశీ కూడా అన్నాడు. సో.. సినీవర్స్ అనే ట్రెండ్స్ లాగా టిల్లు వర్స్ కూడా కంటిన్యూ అవుతుందేమో చూడాలి.

Tags:    

Similar News