డీవీవీ దానయ్యతో విజయ్ హీరోగా సినిమా

Update: 2024-02-01 12:43 GMT

తెలుగులో కూడా విజయ్‌ (Vijay) మూవీస్‌కి మార్కెట్ పెరిగింది. ఇక్కడి ప్రేక్షకులకు మరింత చేరువయ్యేందుకు విజయ్ మరో తెలుగు సినిమా చేయడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ మూవీకి డీవీవీ దానయ్య

(DVV Danayya) నిర్మాతగా వ్యవహిరించనున్నట్లు టాక్. ఓ స్టార్ డైరెక్టర్‌తో సహా విజయ్‌ను కలిసి స్టోరిని వినిపించడం, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని అంటున్నారు. పాన్ ఇండియా (Pan India) స్థాయిలో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. ఈ ఏడాదిలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే ఆలోచన చేస్తున్నారని వినికిడి. అయితే మరో వైపున రాజకీయాల దిశగా విజయ్ వేస్తున్న అడుగుల కారణంగా, ఆయన తదుపరి ప్రాజెక్టుల విషయంలో కొంత సందిగ్ధం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ఎంత వేగంగా ముందుకు వెళుతుందనేది చూడాలి.

ఈ సినిమాకి విజయ్‌ ఊహించని స్థాయిలోరెమ్యునేషన్ డిమాండ్‌ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీనికి దర్శకుడు ఎవరన్నది త్వరలోనే నిర్ణయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ (The Greatest of All Time) మూవీని పూర్తి చేసిన తరువాత విజయ్‌ తన 70వ చిత్ర షూటింగ్‌కు సిద్ధం అవుతారని సమాచారం. విజయ్‌ గతంలో దిల్‌ రాజు నిర్మాతగా వారసుడు చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఆయన త్వరలో రాజకీయ రంగప్రవేశానికి సిద్ధం అవుతున్నట్లు, అందుకు అన్ని విధాలుగా సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జోరందుకుంది. త్వరలోనే పార్టీ పేరును వెల్లడించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు టాక్‌ వైరల్‌ అవుతోంది. దీంతో కొన్ని ఏళ్లు దళాపతి, సినిమాలకు దూరంగా ఉండే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది

Tags:    

Similar News