‘ఈ నగరానికి ఏమైంది’ థియేటర్లో రచ్చకు రెడీ

Update: 2023-06-14 17:02 GMT

ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఎంత బాగున్నా సరే వాటికి అంత గుర్తింపు రావు. థియేటర్స్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయలేక, అండర్ రేటెడ్ గా మిగిలిపోతాయి. తర్వాత ఓటీటీలోకి వచ్చాక సూపర్ హిట్ అవుతాయి. అలాంటి సినిమానే విశ్వక్ సేన్ నటించిన ఈ నగరానికి ఏమైంది. తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా స్టోరీ పరంగా బాగున్నా.. ప్రమోషన్స్ చేయకపోవడం వల్లనో, స్టార్ క్యారెక్టర్లు లేకపోవడం వల్లనో అంతగా ఆడలేదు. ఓటీటీలోకి వచ్చాక చాలామంది ‘అబ్బా ఈ సినిమాను థియేటర్లో ఎలా మిస్ అయ్యాం’అనుకున్నారు.

తాజాగా, ఓల్డ్ సినిమాల రీరిలీజ్ ట్రెండ్ మొదలయ్యాక.. ఈ సినిమాను మళ్లీ రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరారు. అయితే, ఇన్ని రోజులు రీరిలీజ్ పై సస్పెన్స్ ఇచ్చిన మూవీ టీం.. ఇప్పుడు రీరిలీజ్ డేట్ ను ప్రకటించింది. తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వస్తున్న కీడా కోలా సినిమా టీజర్ ను జూన్ 29న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ రోజే ఈ నగరానికి ఏమైంది సినిమా కూడా రీరిలీజ్ కానుంది. దీంతో ఫ్యాన్స్ లో ఉత్సాహం నెలకొంది.

Tags:    

Similar News