ఈ మళయాలవోళ్లున్నారే.. మామూలోల్లు కాదండీ బాబూ. అసలేంటా సినిమాలు. వస్తోన్న ప్రతి సినిమా హిట్ అవుతూనే ఉంది. అసలిది ఎలా సాధ్యం. ఈ రెండు నెలల్లోనే వచ్చిన ప్రేమలు, భ్రమయుగం, మంజిమ్మల్ బాయ్స్, గోట్ లైఫ్ సూపర్ హిట్స్ అయ్యాయి. గోట్ లైఫ్, భ్రమయుగం తప్ప మిగతా రెండు తెలుగులో డబ్ అయ్యి ఇక్కడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇక ఇప్పుడు పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ నటించిన ఆవేశం అనే సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది.
ఫహాద్ కటౌట్ చిన్నదే కానీ కంటెంట్ బలంగా ఉన్నోడు. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతాడు. ఏ సినిమా చేసినా పాత్ర తప్ప తను కనిపించడు. అలాంటి ఫహాద్ నటించిన ఈ ఆవేశం సినిమా ఇప్పుడు మళయాలంలో ఊపేస్తోంది. మరి ఇలాంటి సినిమాలంటే మనోళ్లు ఆగుతారా.. వెంటనే రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే కొన్ని సినిమాలను రీమేక్ చేసి చెడగొట్టేకంటే.. ప్రేమలు, మంజిమ్మల్ బాయ్స్ లాగా డబ్ చేస్తేనే బెటర్ అనేది చాలామంది ఒపీనియన్.
ఆవేశంతో అదరగొడుతోన్న ఫహాద్ ఫాజిల్మరి ఇంతకీ ఆవేశం కంటెంట్ ఏంటీ అంటే.. కాలేజ్ లో చదువుకునే కుర్రాళ్లకు సీనియర్స్ వల్ల అవమానం జరుగుతుంది. వారిపై రివెంజ్ తీర్చుకునేందుకు ఊర్లో పేరు మోసిన రౌడీ అయిన రంగా వద్దకు వెళతారు. ఆ రంగానే ఫహాద్ ఫాజిల్. ఇక్కడి నుంచి కథలో రకరకాల మలుపులు. ఇక టైటిల్, పోస్టర్స్ చూసిన వాళ్లు ఇదేదో చాలా సీరియస్ సినిమా అనుకున్నారు. బట్ కంప్లీట్ ఎంటర్టైనర్. అక్కడక్కడా మంచి ఎమోషన్స్ కూడా పండాయి. ఫహాద్ ఒన్ మేన్ షో తో బాక్సాఫీస్ కళకళలాడుతోంది. మొత్తంగా పుష్ప విలన్ ఆవేశంతో అదిరిపోయే హిట్ కొట్టేశాడన్నమాట.